కే జి ఎఫ్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి రవినా టాండన్. ఇక ఈ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఒకప్పుడు రవీనా టాండన్, అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో మంచి హిట్ పెయిర్ గా పేరు పొందారట. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్టుగా నిలిచాయి. వీరు రిల్ లైఫ్ లో కూడా మంచి పాపులర్ అయిన జంట. ఇక రియల్ లైఫ్ లో కూడా వీరు సూపర్ జోడి అనిపించుకోవాలని అనుకున్నారట.
అలా వీరిద్దరి మధ్య ప్రేమని పెళ్లి వరకు తీసుకువెళ్లాలని సిద్ధమయ్యారు. కానీ ఎంగేజ్మెంట్ తర్వాత వీరిద్దరూ విడిపోవడంపై ఎట్టకేలకు రవీనా టాండన్ నోరు మెదపడం జరిగింది. దాదాపుగా పాతికేళ్ల తర్వాత అక్షయ్ కుమార్ తో బ్రేకప్ పై ఇమే మాట్లాడడంతో అభిమానుల సైతం ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. అక్షయ్ కుమార్ తో వివాహం క్యాన్సిల్ అయిన క్షణాలు ఇప్పటికీ నేను మర్చిపోలేకుండా ఉన్నాను.. బ్రేకప్ తర్వాత నేను అక్షయ్ ఎవరి దారి వారు చూసుకున్నాము.. నేను ఒకరితో డేటింగ్ చేసే అతను మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు ఇద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యామని తెలిపింది
ఇక అంతేకాకుండా మా ఇద్దరి మధ్య ఎప్పుడు అసూయ కూడా ఏర్పడలేదు. అప్పటికి ఇప్పటికీ మేము మంచి హిట్ పెయిర్ గా పేరుపొందాము.. 1994 లో వచ్చిన మెహ్రి చిత్రంతో హిట్టు కాంబినేషన్ మొదలయింది. ఆ తర్వాత మా జోడి కి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఇద్దరం రిలేషన్ షిప్ లో కొద్ది రోజులు ఉన్నాము ఎంగేజ్మెంట్ జరగడం.. ఆ తర్వాత బ్రేకప్ అయిపోవడం అలా వెంట వెంటనే జరిగాయి… ఈ డిప్రెషన్ తో కొద్ది రోజులు న్యూస్ పేపర్ కూడా చదవడం మానేశానని తెలిపింది.