ప్రభాస్ కెరియర్ లో చెప్పుకోదగ్గ చిత్రాలలో మిర్చి సినిమా కూడా ఒకటి అని చెప్పవచ్చు. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్, అనుష్క జంట ఏ విధంగా పాపులారిటీ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిల్లా సినిమాలో కూడా ఈ జంట మొదటిసారి జత కట్టింది ఆ తర్వాతే మిర్చి సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైన మెరిశారు. ఆ తర్వాత బాహుబలి చిత్రంలో కూడా వీరి జంట వర్కౌట్ అయిందని చెప్పవచ్చు.
మిర్చి సినిమా షూటింగ్ సమయంలో ఒక సన్నివేశం ఇప్పటికీ కొద్దిపాటి షాక్ గురయ్యాలా చేస్తూ ఉంటుంది.. పండగల దిగి వచ్చావు అనే సాంగ్లో అనుష్క, ప్రభాస్ ని పైకి ఎత్తుకుంటుంది.. అనుష్క కూడా హైట్ ఉన్నప్పటికీ ప్రభాస్ అంతకుమించి హైట్ ఉంటాడు..ప్రభాస్ లాంటి ఒక కటౌట్ ని మోయాలి అంటే అది చాలా కష్టమైన విషయమే.. ఇక విషయంలో అనుష్క, ప్రభాస్ ని ఎలా ఎత కలిగింది అనే సగటు ప్రశ్న సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కలుగుతుంది.
కానీ అసలు విషయం ఏమిటంటే ప్రభాస్ ని అనుష్క డైరెక్ట్ గా మోయలేదట. ఒక స్టూల్ సహాయంతో ప్రభాస్ ని ఎత్తగలిగిందని సమాచారం. ఇక ఇదే విషయాన్ని అనుష్క ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.ఈ సన్నివేశం సినిమాకి చాలా హైలైట్ గా మారిందని ఏదేఎమైనా ఒక హీరోయిన్ హీరోని మోయడం అంటే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆ రోజు సెట్ లో ప్రభాస్ ని అవలీలగా ఎత్తడంతో చిత్ర బృందం అంత షాక్ అయ్యారట. అప్పట్లో ఈ విషయం బాగా వైరల్ గా మారిందని తెలిపింది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. అనుష్క మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటోంది.