కొన్ని సందర్భాలలో హీరో, హీరోయిన్ కి మధ్య ప్రేమ అనేది ఉండడం సర్వసాధారణంగా ఉండడం సహజము.. ఎందుకంటే వాళ్లు ఇద్దరు కలిసే నటిస్తారు కాబట్టి వీరి మధ్య ప్రేమ అనేది జనరేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక అలా పెళ్లి చేసుకున్న ఆర్టిస్టులు కూడా ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. కొన్ని సందర్భాలలో డైరెక్టర్స్ కూడా హీరోయిన్స్ ని ప్రేమిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక సినిమా సెట్ లో హీరో డైరెక్టర్ ఇద్దరు హీరోయిన్ కి సైట్ కొట్టారట.
ఈ సినిమానే గులాబీ ఈ సినిమా సెట్లో హీరో చక్రవర్తి డైరెక్టర్ కృష్ణవంశీ ఇద్దరు కూడా ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన మహేశ్వరికి సైటు కొట్టారట.ఈ విషయాన్ని స్వయంగా కృష్ణవంశీ గారే తెలియజేయడం జరిగింది. అయితే మహేశ్వరి మాత్రం వీళ్ళని అసలు పట్టించుకోకుండా కేవలం తన పని తాను చేసుకుంటూ వెళ్లేదట. ఇక చక్రవర్తి ,కృష్ణవంశీ ఇద్దరు కూడా మహేశ్వరి విషయంలో ఒకరిని ఒకరు శత్రువులుగా చూసుకుంటూ ఈ సినిమా షూటింగ్ ని చేసుకున్నారట. అలా ఈ సినిమా షూటింగ్ జరిగినంత కాలం కూడా ఇలానే ఉన్నారట.
ఇక హీరోయిన్ విషయం మినహా మిగతా అన్ని విషయాలలో కూడా మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారట. అలాగే ఆ తర్వాత కాలంలో కృష్ణవంశీ రమ్యకృష్ణ ను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం చక్రవర్తి పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. గతంలో ఒక నటిని ప్రేమించి వివాహం చేసుకున్న చక్రవర్తి కొన్ని కారణాల చేత విడిపోవడం జరిగింది. ప్రస్తుతం కృష్ణ వంశీ రంగమార్తాండ సినిమాని తెరకెక్కిస్తున్నారు.