తారకరత్న ఆరోగ్యం పై స్పందించని నందమూరి బ్రదర్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి తారకరత్న కు కొద్దిరోజులు కిందట ఆరోగ్యం సరిగా లేదనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈమధ్య తారకరత్న ఆరోగ్య విషయం కుదుటపడిందని కొన్ని వార్తలు వినిపిస్తున్నా.. వారి కుటుంబ సభ్యులు మాత్రం దీనికి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించటానికి ఇష్టపడలేదు. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అమిగోస్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవ్వగా అక్కడ తారకరత్న ఆరోగ్యం గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం తారకరత్న హెల్త్ గురించి ఇద్దరు హీరోలు మాట్లాడితే అమిగోస్ మూవీ కంటే తారకరత్న హెల్త్ గురించి ఎక్కువ చర్చ జరిగి సినిమాకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉందనుకుంటున్నారేమో అంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Taraka Ratna health update: Jr NTR's cousin 'highly critical' after cardiac  arrest | Celebrities News – India TV

మరోవైపు తారకరత్న ఆరోగ్యం విషయంలో పెద్దగా మార్పు లేదని అందుకే ఈ హీరోలు ఎలాంటి కామెంట్ చేయలేదని సమాచారం అందుతోంది. ఒకవేళ తారకరత్న ఆరోగ్యం సంబంధించి ఏదైనా కామెంట్ చేస్తే వేరువేరు వార్తలు ప్రచారంలోకి వస్తాయి. ఈ రీజన్ వల్లే కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న గురించి మాట్లాడకుండా సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. తారకరత్న త్వరగా కోలుకొని సాధారణ మనిషి అయితే బాగుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందరూ కామెంట్ చేస్తున్నట్టుగా తారకరత్న బయటికి ఆరోగ్యంగా రావాలి అంటే మరి కొద్ది రోజులు పడుతుంది. మరోవైపు అమిగోస్ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా లేవు.

Jr NTR Visits Nandamuri Taraka Ratna In Hospital, Gets Emotional After  Witnessing Cousin's Health; See Viral

బింబిసారా స్థాయిలో ట్రైలర్తో అమిగోస్ మూవీ మెప్పించలేదు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ఉంటే మాత్రమే ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. దాదాపు ఈ సినిమాకి 9 కోట్ల రూపాయల రేంజ్ లో తెలుగు రాష్ట్రాల హక్కులు అమ్ముడయ్యాయి. ఈ సినిమాకి కనీసం 10 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. మరి వెయిట్ చేద్దాం ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో..

Share.