టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి రెడ్డి నటించిన ఆ తర్వాత.. నటుడు సుమంత్ ని ప్రేమించి మరి వివాహం చేసుకుంది. కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారు. కానీ ఇద్దరు కూడా స్నేహంగానే కొనసాగుతున్నట్లు ఒక ఇంటర్వ్యూలో సుమంత్ తెలియజేయడం జరిగింది. అప్పుడప్పుడు కుటుంబ ఫంక్షన్లలో సుమంత్ కీర్తి కూడా కలుస్తూ ఉంటారని సమాచారం.
ఇక తర్వాత కీర్తి రెడ్డి ప్రముఖ ఫ్యాషన్ డిజైన మాజీ మిస్ ఇండియా శిల్పారెడ్డికి కజిన్.. కీర్తి రెడ్డి సోదరుడికి శిల్ప భార్య. అలా ఇద్దరు చాలాసార్లు పలు రకాలుగా ఫంక్షన్ కనిపించడం జరిగింది ఇక శిల్పారెడ్డికి అక్కినేని కుటుంబంతో చాలా అనుబంధం ఉంది. అలాగే సుమంత్ కూడా ఈ సంగతి ఎన్నోసార్లు తెలిపారు. కీర్తి రెడ్డికి విడాకులు ఇచ్చిన తర్వాత శిల్పతో ఉన్న సంబంధం వల్లే స్నేహబంధం ఇంకా కొనసాగుతోందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.
కీర్తి రెడ్డి, సుమంత్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం కొన్ని రోజులపాటు ఒంటరిగా ఉన్న ఆమే ఆ తర్వాత ఒక అమెరికా ఎన్నారై ను పెళ్ళాడి లైఫ్ లో సెటిల్ అయింది.. ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. కీర్తి రెడ్డి హైదరాబాదులో తన బంధుమిత్రుల కుటుంబ వేడుకలకు హాజరవుతూ ఉంటుంది. కీర్తి రెడ్డి నటించిన తొలిప్రేమ సినిమా విడుదలై 25 సంవత్సరాలు అవుతోంది. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఈమె అందంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం కీర్తి రెడ్డికి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.