తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో సుమన్ అప్పట్లో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ను మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయం చేసింది సుమన్ మరొక నటుడు భానుచందర్ అని చెప్పవచ్చు. సుమన్ ఒక సినిమా షూటింగ్లో ఉన్న సమయంలోనే అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ నుంచి పిలుపు రావడం జరిగిందట.. అయితే అసలు ఏంటనే విషయం తెలియకపోయినా ఒక పెద్ద మనిషి పిలిచాడు కాబట్టి సుమన్ ఏమి మాట్లాడకుండా వెళ్లారట. సీఎం హోదాలో ఉన్న ఎంజీఆర్ సుమన్ కి ఒక మాట చెప్పారట.
నువ్వు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నావ్ మంచి నటుడివి పైగా మనమిద్దరం సినిమాలలోనే ఉన్నాము అందుకే ఆ చదువుతో ఒక మాట చెబుతున్న రోజు నిన్ను చూడటానికి వచ్చే ఒక అమ్మాయి వస్తోంది..నువ్వు ఆ అమ్మాయికి దూరంగా ఉండాలని ఆ అమ్మాయికి వివాహం అయ్యింది.. పైగా పోలీసులకు బాసు అయిన డీజీపీ కూతురు ఆ అమ్మాయి సంసారం కూడా చేసుకోకుండా నీ చుట్టూ తిరుగుతోందని చెప్పారట. దీంతో సుమన్ కి అసలు విషయం అర్థమైందట.. నేను ఆ అమ్మాయిని ప్రేమించడం లేదు నాకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారట.
ఇక అంతే కాకుండా తనకు జాగ్రత్త చెప్పడానికి బదులు ఆ అమ్మాయిని నా దగ్గరకు రాకుండా నన్ను ఇబ్బంది పెట్టకుండా చూసుకోమని ఆమె తండ్రికి చెప్పమని సుమన్ ఎంజీఆర్ ముందే తెలిపారుట. దీంతో ఎంజిఆర్ కి కోపం ఎక్కువై ..నేను చెబుతున్న మాటకు ఎదురు చెబుతావా అని మనసులో అనుకొని సుమన్ అక్కడి నుంచి పంపించేశారట .కానీ ఆ తర్వాత వారం తిరగకుండానే సుమన్ పై కొన్ని చిల్లర కేసులు పెట్టి అరెస్టు చేసి బెయిల్ రాకుండా మూడేళ్ల పాటు జైలుకే పరిమితం చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే సుమన్ ను విడిపించడానికి తన తల్లి చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.