ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీల సైతం వరుసగా వివాహాలు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఇదివరకే టాలీవుడ్ పరిశ్రమకు చెందిన ఎంతోమంది సినీ సెలెబ్రేటీలు సైతం పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా పెళ్లి విషయంలో కాస్త ముందుగానే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ నటి కియారా అద్వానీ వివాహ వేదికలు చాలా ఘనంగా జరిగాయి. ఇలా సెలబ్రిటీలందరూ కూడా వివాహం చేసుకొని తమ వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు.
తాజాగా ఈనెల ఆరవ తేదీన రవితేజ హీరోయిన్ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈమె రవితేజతో కలిసి నేనింతే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈమె పేరు సియా గౌతమ్. ఈ క్రమంలోనే నటి సీయా గౌతమ్ కు సంబంధించి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలో వైరల్ గా మారుతున్నాయి. ఈమె భర్త పేరు నిఖిల్ పాల్కేవాలా అన్నట్లుగా తెలుస్తోంది .ఈయన ఒక వ్యాపారవేత్త అన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈమె హల్దీ సంగీత వేడుకలలో పాటు పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
ఇక వీరి వివాహానికి నటి ప్రియమణి దంపతులు కూడా హాజరైనట్లుగా తెలుస్తున్నది.ఈ క్రమంలోనే నేనింతే సినిమాలో నటించినప్పటికీ ఈమె పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. అయితే ఈ విషయం తెలుసుకున్న సీయా గౌతమ్ అభిమానుల సైతం ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. కనీసం ముందుగానే హెల్తీ ఇవ్వకుండా ఇలా వివాహం చేసుకున్నందుకు కొంతమంది అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది నెటిజన్స్ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.