తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . వీరు బాబాయ్ అబ్బాయి మాత్రమే కాదు అంతకుమించి స్నేహితులు కూడా ఇదే విషయాన్ని అటు పవన్ కళ్యాణ్ ఇటు రాంచరణ్ ఎన్నోసార్లు మీడియాతో పంచుకున్నారు. ఇదిలా ఉండగా మెగా హీరోలు ఇప్పటికే చాలామంది ఇండస్ట్రీలో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మెగా హీరోలు ఎవరు ఎంత పారితోషకం తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు మెగా అభిమానులలో అతిపెద్ద సందేహంగా మారింది.
మెగా హీరోలలో మాత్రమే కాదు ఏ సినిమా హీరో అయినా సరే తాను చేస్తున్న కథకు అలాగే కేటాయిస్తున్న డేట్స్ కి అలాగే తన స్టార్ డం ని కూడా దృష్టిలో పెట్టుకొని పారితోషకం తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఉదాహరణకు గత సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ఏడాది రామ్ చరణ్ హీరోగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా విడుదలయ్యింది. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ ముగ్గురు హీరోలలో గత ఏడాది ఎవరు ఎక్కువ పారితోషకం తీసుకున్నారు అంటే రామ్ చరణ్ పేరు వినిపిస్తోంది.
ఆర్ ఆర్ ఆర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాదు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. అందుకే ఆయన ఈ సినిమా కోసం రెమ్యునరేషన్‌తో పాటు లాభాలలో వాటా కూడా పొందినట్లు సమాచారం. మొత్తం ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ రూ. 50 కోట్ల రెమ్యునరేషన్ దక్కించుకోగా.. చిరంజీవి కూడా ఆచార్య సినిమాకు రూ.50 కోట్లు దక్కించుకున్నట్లు సమాచారం.