బుల్లితెర పై యాంకర్ సుమని లేడీ సూపర్ స్టార్ సుమ అనడంలో సందేహం లేదు. ఆమె యాంకర్ గా బుల్లితెరపై అడ్డా ఏర్పరచుకుంది.. చాలామంది సుమ డేట్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంత పేరును సంపాదించుకుంది. ఒకప్పుడు పలు సినిమాలలో కూడా నటించింది. కానీ అక్కడ పెద్దగా పేరు సంపాదించుకోలేక పోయింది.ఈమె రాజీవ్ కనకాల ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్యకాలంలో భారీ అంచనాల నడుమ ఆమె చేస్తున్న సుమ అడ్డ కార్యక్రమం టెలికాస్ట్ అవుతోంది.
సుమ, రాజీవ్ కనకాల ఇద్దరు ఒకప్పుడు బుల్లితెరపై సమఉజ్జీలుగా పోటీపడేవారు. ఆ తర్వాత రాజీవ్ సినిమాల్లో బిజీ అయ్యాడు.. సుమ మాత్రం బుల్లితెరపై సూపర్ యాంకర్ గా కొనసాగుతోంది. సుమను చూస్తే వెండితెరపై నయనతార గుర్తుకు వస్తోంది. ఆమె లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే అలాగే నయనతార ఏ స్థాయిలో అయితే సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటుందో అదే స్థాయిలో బుల్లితెర యాంకర్ కూడా రెమ్యూనరేషన్ దక్కించుకుంటుంది.
చాలామంది అనుకుంటుంటారు రాజీవ్ కంటే సుమనే ఎక్కువ సంపాదిస్తుందని.. అలా అనుకుంటే పొరపాటే సుమ కంటే రాజీవ్ ఎక్కువ సంపాదన ఉంటుందట.ఆయన ఒకవైపు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ సినిమాల్లో నటిస్తూ ఉండటం వల్ల సుమ కంటే కాస్త రాజీవ్ ఎక్కువగానే సంపాదిస్తూ ఉంటాడని . అని బుల్లితెరవర్గాల టాక్ ..ఈ మధ్యనే కొన్ని కారణాలవల్ల రాజీవ్, సుమ మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత పెద్దలు సర్ది చెప్పడంతో పిల్లల కోసం కలిసిపోయారనీ వార్తలు వినిపించాయి.. ఇప్పుడు వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడిపేస్తున్నారు. సుమ ఒకవైపు యాంకర్ గా మరోవైపు కుటుంబ బాధ్యతలను పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందడుగు వేస్తున్నారు.