2018 వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరితో కలిసి మోహబూబా సినిమాతో నటించింది హీరోయిన్ నేహా శెట్టి. తన మొదటి సినిమాతోనే ఫ్లాప్ అయినప్పటికీ తెలుగులో మళ్లీ సందీప్ కిషన్ తో గల్లీ రౌడీ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా ఫ్లాప్ కావడంతో అఖిల్ సినిమాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో ఇమే కీలకమైన పాత్రలో నటించింది. అదృష్టం కొద్దీ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాలో అవకాశం దక్కించుకుంది.
ఈ సినిమాలోని రాధిక పాత్రకు బాగా పేరు వచ్చింది. హీరోయిన్గా డీజే టిల్లు తరువాత ఈ ముద్దుగుమ్మకు వరుసగా స్టార్ హీరోల సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం వస్తుందని అందరూ భావించారు. కానీ అలా మటుకు జరగలేదు. డీజే టిల్లు సినిమా వచ్చి ఏడాది కావస్తున్న ఇప్పటివరకు ఈమె మరొక విజయాన్ని అందుకోలేకపోయింది. కనీసం ఒక మంచి సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం నటుడు కార్తీ సరసన బెదురులంక 2012 అని చిత్రంలో నటిస్తోంది. కేవలం ఈ సినిమా పైనే ఈమె ఆశలన్నీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
బెదురులంక సినిమా అసలు వచ్చి పోయిందా అన్నట్టుగా విడుదలయ్యే పోయింది. దీంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఇలాంటి సినిమాలు కూడా లేవు.. ఒకటి రెండు చర్చలు దశలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాధిక మంచి పాపులారిటీ దక్కించుకున్న స్నేహ శెట్టి కి ఇలా ఆఫర్లు లేకపోవడంతో ఈమె అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు. దీంతో మరి ఎలాగైనా సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.