రెబల్ స్టార్ ప్రభాస్ గురించి తెలుగు సినీ పరిశ్రమకే కాదు యావత్తు ప్రపంచ సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన తన సినిమాలను ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా చేశాడు. దీంతో ప్రభాస్ పేరు ఎక్కడ చూసినా మారుమ్రోగిపోయింది. ఇదిలా ఉండగా ప్రభాస్ సినిమాల విషయాన్ని పక్కన పెడితే ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనే వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి.. సినీ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్.
ఈ క్రమంలోని ఆయన పెళ్లి పై ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇటీవల బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో కూడా అనుష్క , కృతి సనన్ ల ఫోటోలను చూపించి ఇద్దరిలో ఎవరిని వివాహం చేసుకోబోతున్నావని బాలయ్య ఇరుకును పెట్టే ప్రశ్న అడిగినప్పటికీ ప్రభాస్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే ప్రభాస్ ఎప్పుడైతే ఆది పురుష్ సినిమా చేయడం మొదలు పెట్టాడు. ఆ సినిమా ఆడియో టీజర్ లాంచ్ లో కృతి సనన్ ఆయనతో వ్యవహరించిన తీరుని చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు బాగా వైరలయ్యాయి. కానీ కృతి సనన్ స్నేహితులం మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది.
కానీ తాజాగా ప్రముఖ సినీ క్రిటిక్ గా చెప్పుకునే ఉమైర్ సందు తను ట్విట్టర్ ఖాతా ద్వారా.. బిగ్ బ్రేకింగ్ న్యూస్ మాల్దీవులలో ప్రభాస్, కృతి సనం ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు.. వచ్చే వారం ఎంగేజ్మెంట్ అంటూ ఒక ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది.
BREAKING NEWS: #KritiSanon & #Prabhas will get engaged next week in Maldives 🇲🇻!! So Happy for them.
— Umair Sandhu (@UmairSandu) February 5, 2023