అఖిల్ వీడియో పై క్రేజీ కామెంట్స్ చేసిన సమంత..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ గా మారుతూనే ఉంటుంది. గడిచిన కొద్దిరోజులుగా మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న ఈమె ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంటోంది. ఇటీవలే హాలీవుడ్ సినిమా సిటాడెల్ చిత్రీకరణ షూటింగ్లో పాల్గొనింది. ఇక అప్పుడప్పుడు అభిమానుల కోసం పలు మోటివేషన్ కొటేషన్స్ షేర్ చేస్తూ ఉంటుంది. తాను ఎదుర్కొన్న కొన్ని క్లిష్ట పరిస్థితుల గురించి పరోక్షంగా స్పందిస్తూ ఉంటుంది సమంత.

Samantha Akkineni makes it possible for Akhil

అయితే ఇప్పుడు తాజాగా అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ నిన్నటి రోజున ఒక వీడియోని కూడా విడుదల చేశారు. ఈ వీడియో పై సమంత స్పందించినట్లు తెలుస్తోంది. 2017లో నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత 2021లో విడాకులు తీసుకున్నారు .దీంతో ఒక్కసారిగా అక్కినేని అభిమానులు షాక్కు గురయ్యారు. ఇప్పటికే పలువురు అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం వీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. ఎప్పుడూ కూడా సమంత అక్కినేని కుటుంబంపై స్పందించలేదు తాజాగా అఖిల్ షేర్ చేసిన ఒక వీడియో పై క్రేజీ కామెంట్లు చేసిందని సమాచారం.

ఏజెంట్ సినిమాకు డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.స్పై యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదల కాబోతోంది. ఇందుకు సంబంధించి ఒక పవర్ఫుల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను అఖిల్ తన ఇన్స్టాల్ షేర్ చేయగా దీనికి సమంత లైక్ కొట్టింది అలాగే బీస్ట్ మోడ్ ఆన్ ఫైర్ అంటూ కామెంట్ చేసింది అయితే సమంత కామెంట్ పై అఖిల్ ఇంకా స్పందించలేదు. అయితే సమంత చైతుతో విడిపోయిన తర్వాత గత ఏడాది ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు అఖిల్.

 

View this post on Instagram

 

A post shared by Akhil Akkineni (@akkineniakhil)

Share.