అలనాటి హీరోయిన్ అందం అభినయంతో నాట్యంతో మైమరిపించి తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది అలనాటి హీరోయిన్ భానుప్రియ. ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్ర కథానాయకిగా ఒక వెలుగు వెలిగింది. ఆ తర్వాత సహాయ పాత్రలలో కూడా నటించింది. తల్లిగా, వదినగా ,అక్కగా ఎన్నో చిత్రాలుగా కలిసి నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ వంటి భాషలలో కూడా నటించింది. వెండితెర పైన కాకుండా బుల్లితెర పైన కూడా పలు సీరియల్స్ లో కనిపిస్తూ ఉండేది.
గత ఏడాది సిల్వర్ స్క్రీన్ పై నటనతో ప్రేక్షకులను మెప్పించింది భానుప్రియ.. అయితే కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నది. అంతేకాకుండా ఇటీవల కొద్ది రోజులుగా ఆమె సినిమాలు ఒప్పుకోలేదని ఆమెకు జ్ఞాపకశక్తి తగ్గిపోయింది అంటూ పలు రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఇమే భానుప్రియ ఆరోగ్యం పైన స్పందించింది. క్లాసికల్ డాన్స్ ఒక డాన్స్ స్కూల్లో పెడదామని గతంలో అనుకున్నదట. కానీ ఐదేళ్ల క్రితం ఈమె భర్త ఆదర్శ కౌశల్ కన్ను వేయడంతో తీవ్ర విషాదంలోకి కూరుకుపోయింది.
ఆ తర్వాత కొన్నేళ్ల నుంచి ఆరోగ్యం బాగుండడం లేదని మెమొరీలాస్ సమస్యతో బాధపడుతున్నారని కొన్ని ఐటమ్స్ ను మర్చిపోతున్నానని వార్తలు వినిపిస్తున్నాయి.. గత రెండేళ్లుగా మెమొరీ లాస్ సమస్యతో బాధపడుతున్నానని తెలియజేసింది. ఈ మధ్య ఒక సినిమా షూటింగ్ సమయంలో డైలాగ్స్ కూడా మర్చిపోయానని తెలిపింది భానుప్రియ. ఒక తమిళ సినిమాలో యాక్ట్ చేశాను లొకేషన్ వెళ్లి యాక్షన్ అనగానే డైలాగులతో మర్చిపోయాను తెలిపింది మళ్లీ నేను సర్దుకున్నాక సూట్ చేశారని తెలియజేసింది.. ఇక తన ఆరోగ్యం బాగాలేదుకపోవడం వల్లే ప్రస్తుతం మెడిసిన్ వాడుతున్నానని తెలిపింది భానుప్రియ.