తెలుగులో న్యాచురల్ స్టార్‌గా నాని తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా నానితో సినిమా చేస్తే హిట్టు బొమ్మ పడినట్లే అని చాలా మంది ప్రొడ్యూసర్స్ ఫిక్స్ అయ్యారు. అయితే నానికి భారీ డిమాండ్ రావడంతో బిజీగా మారిపోయాడు. దీంతో అందరికీ తన డేట్లను అడ్జస్ట్ చేయలేకపోవడంతో కొందరు నాని అంటే కోపం కూడా పెంచుకున్నారు. కానీ వారికి ఇప్పుడు ఇంకో హీరో దొరికిపోయాడని ఆనందపడుతున్నారు.
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా గీత గోవిందం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు ప్రేక్షకులు అదిరిపోయే రెస్పాన్స్ ఇవ్వడంతో ఇప్పుడు విజయ్ మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోగా మారిపోయాడు. విజయ్ ఎంచుకునే సబ్జెక్ట్స్ అందరినీ ఆకర్షిస్తుండటంతో ఇప్పుడు మనోడికి భీబత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో నానిని రీప్లేస్ చేసే మొనగాడు దొరికాడంటూ నిర్మాతలు మురిసిపోతున్నారు.
ఇకపై నాని మరింత జాగ్రత్తగా ఉంటేనే విజయ్ దేవరకొండతో పోటీలో నిలబడగలడు. ఏమాత్రం తేడా వచ్చినా నాని రొటీన్ స్టార్‌గా మారిపోయి విజయ్ దేవరకొండ ముందు ఓడిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి వీరిద్దరు తమ ఫ్యూచర్ సినిమాలతో ఇంకా ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.