ఈ మధ్యకాలంలో బుల్లితెరపై ఎక్కువగా ఓటీటి లపై.. పలు యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువగా టాక్ షోలను నిర్వహిస్తూ ఉన్నారు. ఒకప్పుడు సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తే చాలా ఆసక్తికరంగా ప్రేక్షకులు ఎదురుచూసేవారు. అయితే ప్రస్తుతం ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. పలు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా టాక్ షోలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో పాల్గొన గెస్ట్ లకు రెమ్యూనరేషన్ ఇస్తారా లేదా అనే విషయంపై అందరు కూడ సందిగ్ధంగానే ఉంటారు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ క్రమంలోనే బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆహాకు బాగా పబ్లిసిటీ రావడం జరిగింది. అంతేకాకుండా ఆహా సబ్స్క్రైబ్ కూడా పెరిగారనే టాక్ వినిపిస్తోంది. ఈ షో లకు మహేష్ బాబు, ప్రభాస్ ,పవన్ కళ్యాణ్, అడవి శేషు, శర్వానంద్ తదితర నటీనటులు రావడం కూడా జరిగింది. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా రావడం వల్ల మరింత పబ్లిసిటీ పెరుగుతోంది. ఇక అలాగే కొంతమంది సినిమాల ప్రమోషన్స్ కు కూడా ఈ టాక్ షో బాగా ఉపయోగపడుతోందని సమాచారం.
ఇకపోతే స్టార్ సెలబ్రిటీలు రెమ్యూనికేషన్ తీసుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే టాక్ షోలకు చిన్నచిన్న సెలబ్రిటీలు వస్తే ఖచ్చితంగా వారు రెమ్యూనరేషన్ తీసుకుంటారని చెప్పవచ్చు.. కానీ సినిమాలలో తీసుకునేంత రెమ్యూనరేషన్ కాకపోయినా వారికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్ చెల్లిస్తారని వార్తలు అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై అటు టాక్ షో నిర్వహించే నిర్మాణ సంస్థలు తెలియచేస్తే అసలు విషయం తెలుస్తుందని చెప్పవచ్చు.