బుల్లితెరపై ఎంతోమంది లేడీ యాంకర్స్ ఉన్నారు. కానీ మేల్ యాంకర్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. బుల్లితెర మేల్ యాంకర్ గా ఎంతమంది వచ్చినా వీరిలాగా ఎవరు క్రేజ్ తెచ్చుకోలేదు. అందులో ఒకరు రవి , ప్రదీప్.. ప్రదీప్ రవి కొన్ని ఈవెంట్లతో ప్రస్తుతం చాలా బిజీగా ఉంటున్నారు. చెప్పాలంటే రవి కన్నా అధిక స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినప్పటికీ రవితో పోలిస్తే ప్రదీప్ కి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతానికి వరుస ఈవెంట్లతో బిజీగా ఉన్నాడు ప్రదీప్. రవి మాత్రం బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. ఎందుకంటే ఇప్పుడు తెలుసుకుందాం. మొదట్లో రవి మ్యూజిక్ ఛానల్ కు యాంకర్ గా వ్యవహరిస్తూ ఉండేవారు. అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ఇలా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న రవి.. బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా వెళ్లారు. ఆ కార్యక్రమం ద్వారా రవి కాస్త నెగిటివ్ వి ఎదుర్కొన్నారు. అయితే బిగ్ బాస్ తర్వాత బుల్లితెరకు దూరమయ్యాడు రవి.. ఒకప్పుడు అవార్డ్స్ ఈవెంట్ కు అలాగే ఇతర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి ప్రస్తుతం బుల్లితెరకు రాను రాను దూరమైపోయాడు. అయితే రవి బుల్లితెరకు దూరం కావటానికి కారణాలు లేకపోలేదు. రవి ఏ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించినా.. తోటి వారిని చాలా చులకన భావనతో మాట్లాడడమే కాకుండా డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడడమే రవి చేసిన పెద్ద తప్పు. అందుకని బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారని తెలుస్తోంది. ఇప్పుడైతే రవి కన్నా ప్రదీప్ ముందంజలో ఉన్నాడు. ప్రదీప్ గురించి చెప్పాలంటే ఆయన అందరితో సంతోషంగా నవ్వుతూ జోక్స్ వేస్తూ అందరిని అలరిస్తూ ఉంటాడు.