తెలుగు సినీ ఇండస్ట్రీలో తపన అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ అర్చన. ఆ తరువాత నేను అనే సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకుంది. తన మొదట వేద పేరుతో సినిమాలకు పరిచయమైన తర్వాత కొద్ది రోజులకు అర్చన పేరుతో కెరీర్ను కొనసాగింది. ఇక ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన బిగ్ బాస్ -1 కంటిస్టెంట్గా వచ్చి ఐదవ స్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుతం వివాహం చేసుకున్న అర్చన చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా అర్చన తనకు జరిగిన కొన్ని చేదు సంఘటనల గురించి తెలియజేసింది.
ఇండస్ట్రీకి ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా సపోర్ట్ లేకుండా ఒక అమ్మాయి వచ్చింది అంటే ఆ అమ్మాయి వీక్నెస్ అడ్వాంటేజ్ గా తీసుకునేవారు చాలామంది ఉంటారంటూ అర్చన అభిప్రాయంగా తెలియజేసింది.. కానీ తనకు మాత్రం తన తల్లిదండ్రులు సపోర్టు ఉండటం వల్ల అలాంటి పరిస్థితుల నుండి తప్పించుకున్నానని తెలిపింది. ఇక తనతోటి ఉన్న మరొక అమ్మాయి ఇలాంటి ఇష్యూలోని ఇరుక్కుందని కొంతమంది హీరోలు అలా అమ్మాయిలను డ్రాప్ చేయడానికి ఉంటారని తెలిపింది.
మనకు బాగా తెలిసిన సక్సెస్ లేని ఒక హీరో వల్ల నేను ఎన్నోసార్లు ఇబ్బంది పడ్డాను కానీ తన తల్లితండ్రుల సపోర్టు ఉండటం వల్ల నేను బయటపడ్డానని తెలిపింది. తన సినీ కెరియర్లో అదొక చేదు అనుభవం అంటూ తెలియజేసింది అర్చన . సినీ ఇండస్ట్రీనే కాదు ఏ రంగంలోనైనా వెళ్లాలనుకున్న అమ్మాయిలు ధైర్యంగా ఉన్నంతవరకు ఎవరు ఏమి చేయలేరని తెలుపుతోంది ఎప్పుడైతే వీక్ అవుతారో ఖచ్చితంగా అప్పుడు పక్కన ఉన్నవారు అడ్వాంటేజ్ తీసుకుంటారని కామెంట్లు చేసింది.