సీనియర్ నటీమణుల తో కలిసి రచ్చ చేస్తున్న సురేఖవాణి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు సైతం ఎంతోమంది ఉన్నప్పటికీ అక్క వదిన అమ్మ పాత్రలలో నటించే క్యారెక్టర్ ఆర్టిస్టులకు బోలెడంత క్రేజ్ ఉంటుందని చెప్పవచ్చు. అలాంటి వారిలో సురేఖ వాణి, పవిత్ర లోకేష్, ప్రగతి, హేమ తదితరులు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలలో రాణిస్తున్నారు. ఎన్నో సినిమాలలో హీరో హీరోయిన్లకు తల్లి క్యారెక్టర్లలో అలాగే వదిన అత్త క్యారెక్టర్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాలలో సీరియల్స్ లో కూడా నటిస్తూ ఉన్నారు.

Surekha Vani: సురేఖా వాణి స్టెప్పుల‌కి సోష‌ల్ మీడియా షేక్..ఒకే చోట చేరిన  లేడి యాక్ట‌ర్స్..!

కొంతమంది వెండితెర పైన సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెర పైన నటిస్తూ ఉన్నారు. ఇదంతా ఇలా ఉండగా తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఇంట్లో ఒకప్పటి సీనియర్ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కలిసి సందడి చేయడం జరిగింది. అంతేకాకుండా అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేయడంతో పాటు ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతోపాటు కలిసి డాన్స్ వేయడం కూడా జరిగింది అందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ కలిసి.. రారా రక్కమ్మ అనే సాంగ్కు స్టెప్పులు వేయడం జరిగింది.

ఇక అందుకు సంబంధించి ఫోటోలు వీడియోలు నేటిజెన్లు ప్రశంశాల వర్షం కురిపిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉన్నప్పటికీ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అయిన ప్రగతి, పవిత్ర లోకేష్ మిస్సయ్యారని తెలుస్తోంది. అయితే గెట్ టుగెదర్ పార్టీలో అంతా కలవడంతో పాటు సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఈ ఫోటోలను వీడియోలను చూస్తే మనకి అర్థమవుతోంది. సురేఖ వాణి తన ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ ఫ్రెండ్స్ ఫరెవర్ అంటూ లవ్ సింబల్ ని జత చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)

Share.