మంచు మనోజ్ భూమా మౌనిక పెళ్లి చాలా గ్రాండ్గా ఈనెల రెండవ తేదీ జరగబోతుందని గడిచిన కొద్దిరోజుల నుంచి వార్తలు వినిపించాయి. అయితే ఫిబ్రవరి రెండవ తేదీ ముగిసిన మనోజ్, మౌనికల పెళ్లి జరిగినట్టుగా ఎక్కడ వార్తలు మాత్రం వినిపించలేదు. కొన్ని రోజుల క్రితం వరకు కొత్త సినిమా ప్రకటించిన మంచు మనోజ్ తన పెళ్లి గురించి మాత్రం ఎక్కడ ప్రకటన మాత్రం చేయలేదు. ప్రస్తుతం మనోజ్ సైలెంట్ గా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
కుటుంబ సమస్యల వల్లే మంచు మనోజ్, మౌనికాల పెళ్లి వాయిదా పడిందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరికొంత సమయం వీరి పెళ్లికి పడుతోందని సమాచారం. మంచు మనోజ్ గతంలో ఓకే చెప్పిన అహం బ్రహ్మాస్త్రి సినిమా ఎప్పుడు పూర్తవుతుందో ఈ సినిమా ఎప్పుడు థియేటర్లో విడుదల అవుతుందో ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. మనొజ్ రెండో పెళ్లికి సంబంధించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని పలువురు అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు.
ఇకపై మంచు మనోజ్ ప్రాజెక్టులన్ని సక్సెస్ సాధించాలని మనోజ్ అభిమానులు కోరుకుంటున్నారు మంచు ఫ్యామిలీ పై నెగిటివ్ ఉన్నప్పటికీ మంచు మనోజ్ మాత్రం ఆ విషయంలో కాస్త మినహాయింపు ఉంటుందని చెప్పవచ్చు. మంచు మనోజ్ ప్రస్తుతం ఒక్కో చిత్రానికిరూ.4 కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్లు సమాచారం. సొంత బ్యానర్ లోనే నటించడానికి మంచు మనోజ్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ ఉన్న క్రేజీ ప్రాజెక్టులలో నటించాలని స్టార్ దర్శకులు డైరెక్టర్లలో నటించాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.నటుడిగా క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచే ప్రాజెక్టులలో రాబోయే రోజుల్లో నటిస్తారేమో చూడాలి మరి.