తెలుగులో ఫిదా చిత్రం ద్వారా మొదటిసారి సినీ పరిశ్రమకు పరిచయమైంది హీరోయిన్ సాయి పల్లవి. తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకొని మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ విజయం కావడంతో సాయి పల్లవి నటన, అందం డాన్స్‌కు తెలుగు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్రంతో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ ను కూడా సంపాదించుకుంది. ఇక చివరిగా ఈమె విరాటపర్వం, గార్గి సినిమాలలో నటించింది.
త్వరలో సాయి పల్లవి వివాహం చేసుకోబోతోందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ వృత్తిని చేపట్టిన సాయి పల్లవి ఇండస్ట్రీలో అడుగుపెట్టి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ తరం హీరోయిన్లలో సాయి పల్లవి వేరు అని చెప్పవచ్చు సినిమాలలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది. ఎక్స్పోజింగ్ వంటి వాటికి దూరంగానే ఉంటూ ఉంటుంది. ఎలాంటి స్టార్ హీరో సినిమా అయినా సరే ఆ సినిమాలో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమాను ఒప్పుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం సాయి పల్లవి కొత్త సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ కూడా లేదు. దీంతో సాయి పల్లవి సినిమాలు మానేసిందని పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వినిపించాయి.. దీంతో వాటన్నిటికీ చెక్ పెడుతూ అవన్నీ ఫేక్ అని సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నవ్వులు, ఆశలు, కృతజ్ఞతలు అంటూ కామెంట్ చేయడం జరిగింది.. జీవితంలో ఈ మూడు ఉంటే చాలు అని పరోక్షంగా చెప్పగానే చెప్పినట్లు తెలుస్తోంది సాయి పల్లవి.