ప్రస్తుతం సమంత పరిస్థితి చూస్తుంటే చాలా కష్టాలు పడుతోందని చెప్పవచ్చు. ఒకవైపు వ్యక్తిగత జీవితం మరొకవైపు ఆరోగ్య సమస్యలు ఇలా అన్నీ కూడా వెంటాడుతున్న తనదైన శైలిలో నిలదొక్కుకుంటూ ముందుకు వెళ్తోంది సమంత. మయోసైటీస్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ తన కెరియర్ పైన దృష్టి పెడుతోంది. ఇటీవలే శాకుంతలం సినిమాని పూర్తి చేసుకున్న సమంత తాజాగా మరొక బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమవుతున్నది.
ఇదంతా ఇలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారుతోంది .తన వ్యక్తిగత జీవితంలో తను ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ సమంత ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేయడం జరుగుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అందరిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సమంత ఫ్యామిలీ మెన్ మేకర్స్ నుంచి వస్తున్న సీటాడెల్ వెబ్ సిరీస్‌లో సమంత జాయింట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ టీం తో సమావేశమైన ఫోటో మరికొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది సమంత. ఇందులో తాను రాసుకొచ్చిన ఒక పోస్టును సైతం షేర్ చేయడం జరిగింది.
ఇందులో తాను రాసుకుంటూ “గట్టిగా ఊపిరి పీల్చుకో పాప త్వరలో అన్ని చక్కబడతాయని నేను నీకు మాటిస్తున్నాను గడిచిన ఏడు ఎనిమిది నెలలుగా నువ్వు అత్యంత ఇబ్బందికరమైన రోజులను ఎదుర్కొన్నావు వాటిని మాత్రం మర్చిపోవద్దు ఆ క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నావో ఎప్పటికీ గుర్తు పెట్టుకో ఆ సమయంలో నువ్వు ఆలోచించడం మానేశావు.. దేనిపైన ఏకాగ్రత పెట్టలేకపోయావు..సరిగా నడవలేక పోయావు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు అడుగు వేశావు నీ విజయంలో నేను ఎంతో గర్వంగా ఉన్న నువ్వు కూడా నాలాగే గర్వపడు అంటూ రాసుకుంది”.
View this post on Instagram