హీరో కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె మల్టీ టాలెంటెడ్ కలిగిన హీరోయిన్ అని చెప్పవచ్చు. ఒక్కవైపు సింగర్ గా మ్యూజిక్ కంపోజర్ రైటర్ గా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించాయి. ఈ రెండు సినిమాలు విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫుల్ ఖుషి గా ఉన్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్లో నటించిన లక్ సినిమా విడుదలై ఇప్పటికీ 14 ఏళ్ళు పూర్తి అవుతున్న సందర్భంగా ఒక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ విషయంపై మాట్లాడుతూ నేను సినీ పరిశ్రమలు వచ్చినప్పుడు తన సింగింగ్ గురించి ఎక్కడ మాట్లాడవద్దని చెప్పేవారట. అలా చేస్తే సినిమాల పైన ప్రభావం పడుతుందని చెప్పేవారట. నేను రెండిటికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగాను మొదటిసారి మైకు ముందు పాడిన విషయం తనకు బాగా గుర్తు ఉంది ఆరోజు మా నాన్న నేనెలా పాడుతాను అని చాలా భయపడ్డారు.
కోవిడ్ సమయంలో నేను నా కలను ఎంతో మెరుగుపరుచుకున్నాను ఆ తర్వాతే స్టేజ్ పైన పాల్గొని ప్రేక్షకుల స్పందన ప్రత్యక్షంగా చూడడం చాలా ఆనందంగా అనిపించిందని తెలిపింది. పాట రాయడం అనేది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప బహుమతి అని తెలియజేసింది శృతిహాసన్. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే టాలీవుడ్లో కాకుండా బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తున్నది.ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ముంబైకి చెందిన డుడుల్ ఆర్టిస్ట్ శాంతాను వివాహం చేసుకోబోతోంది.