తాజాగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో.. ఇటు సినిమాలలో తరచూ యాక్టివ్ గా ఉంటున్నారు. కానీ ఎక్కడికి వెళ్లినా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం మాత్రం బాగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ విషయం అభిమానులలో తీవ్ర ఇబ్బంది గురిచేస్తోంది. అయితే పవన్ తన పర్సనల్ విషయాలను ప్రజాసేవకు లింకు చేయకూడదని ఎన్నోసార్లు చెప్పారు. ఈ విషయాన్ని నందమూరి బాలకృష్ణ తాజాగా అన్ స్టాపబుల్ షోలో ప్రస్తావించడం జరిగింది.
బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ రెండవ సీజన్ ఆఖరి ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ తో ముగిసేలా ప్లాన్ చేశారు. రెండు భాగాలుగా ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ నిన్నటి రాత్రి ఓటిటి ప్లాట్ఫారంలో అందుబాటులోకి వచ్చింది. తొలిభాగం చాలా సరదాగా సాగింది పవన్ కళ్యాణ్ ను భయ్యా అంటూ సరదాగా పిలిచిన బాలయ్య ఆయన దగ్గర నుంచి సమాచారాన్ని పూర్తిగా రాబట్టారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అసలు బ్రహ్మచారిగా ఉండిపోవాలని యోగమార్గంలోకి వెళ్లాలనుకున్నాను. కానీ నా జీవిత ప్రయాణం చూసుకుంటే నేనేనా నాకేనా ఇన్నిసార్లు జరిగాయి అనిపించింది.. ఏది నేను ప్లాన్ చేయలేదు. నేను ఎప్పుడు చాలా సాంప్రదాయ పద్ధతిగా బతికే వ్యక్తిని. మొదటి వివాహం చేసుకున్నప్పుడు చాలా సాంప్రదాయమైన పద్ధతి ఇంట్లో వాళ్ళు చూసి చేశారు. రిలేషన్ షిప్ లో కొన్ని విభేదాలు రావడం వల్ల రెండవ పెళ్లి చేసుకున్నాను కానీ ఏకాభిప్రాయం లేక వేరే కారణం చేతను విడిపోయాము.. ప్రతిసారి మూడు పెళ్లిళ్లు అంటుంటే ముగ్గురిని ఒకేసారి చేసుకోలేదు రా బాబు ముగ్గురితో ఒకేసారి ఉండట్లేదు ఒక వ్యక్తితో కుదరలేదు. ఇంకోసారి చేయవలసి వచ్చింది ఆ వ్యక్తితో కూడా కుదరలేదు ఇంకోసారి చేసుకున్నాను అంటూ తెలిపారు.