తెలుగు సినీ ఇండస్ట్రీలో రకుల్ ప్రీతిసింగ్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. పంజాబీ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు తన అందంతో డాన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. మొదట కెరటం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా కూడా గుర్తింపు పొందింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా రకుల్ ప్రీతిసింగ్ తెలుగులో పెద్దగా నటించలేదు.
కేవలం ఎక్కువగా బాలీవుడ్ లోనే పలు సినిమాలలో నటిస్తూ అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చూస్తోంది. ఇదంతా ఇలా ఉండగా తాజాగా రకుల్ ప్రీతిసింగ్ కు సంబంధించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. రకుల్ ప్రీతిసింగ్ ఒక స్టార్ హీరోకి భార్యకి భయపడుతుందట ..ఎంతలా అంటే ఆమెను చూస్తే ఈమెకు వణుకు వస్తుంది అనే అంతలా భయపడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆమే ఎవరో కాదు అల్లు అర్జున్.. భార్య స్నేహారెడ్డి. ఈమెకు రకుల్ ప్రీతిసింగ్ చాలా భయపడుతుందని సోషల్ మీడియాలో చాలా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే అందుకు గల కారణమేమిటంటే అల్లు అర్జున్ తో కలిసి నటించే సమయంలో రకుల్ ప్రీతిసింగ్ కూడా చాలా క్లోజ్ గా ఉండేదట. దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్న రకుల్ ప్రతిసారి అల్లు అర్జున్ కు ఫోన్ చేయడం మొదలుపెట్టిందట దీంతో ఒకరోజు విసిగిపోయిన స్నేహ రెడ్డి తన పలుకుబడితో రకుల్ కి ఫోన్ చేసి తిట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అప్పటినుంచి రకుల్ ప్రీతిసింగ్ స్నేహ రెడ్డిని చూస్తే భయపడుతుందని వార్తలు వైరల్ గా మారుతున్నాయి.