టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లలో చాలామంది చేసే ఒకే ఒక పొరపాటు ఏమిటంటే.. కథ,పాత్ర తెలియకుండా ఆ సినిమాలకు ఓకే చెప్పటమే.వారు చేసే పెద్ద తప్పు ఇదే .అలా ఏ సినిమా అంటే ఆ సినిమా ఒప్పుకుంటే సినీ ఇండస్ట్రీకి దూరం కావాల్సిందే.. ఒకప్పుడు చాలా సినిమాలను ఒప్పుకొని కృతి శెట్టి అగ్ర హీరోల సరసన నటించి ఇప్పుడు కాస్త పక్కకు తప్పుకుంది. ఈ హీరోయిన్ గా కొన్నేళ్ళ క్రితం నటిగా ఒక వెలుగు వెలిగిన రకుల్ కూడా కొన్ని సినిమాల ఎంపిక విషయంలో తప్పుచేసి ఆఫర్లను కోల్పోయింది.
వాస్తవానికి బన్నీ, తారక్ ,చరణ్ లకు జోడిగా నటించిన సినిమాలలోని పాత్రలు రకుల్ కు మంచి పేరును తెచ్చి పెట్టడంతో పాటు కమర్షియల్ గా కూడా సక్సెస్ను సాధించాయి. కానీ మహేష్ బాబు సరసన నటించిన స్పైడర్ సినిమాలో రకుల్ కొంచెం బోల్డ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో రకుల్ లుక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండదు. చెప్పాలంటే ఈ సినిమానే రకుల్ కు మైనస్ అయ్యింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా వల్లే రకుల్ కెరియర్ కు తగ్గుముఖం పట్టాయి.టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. స్పైడర్ సినిమా ప్లాప్ కావటంతో ఆమెకు అవకాశాలన్నీ దూరమయ్యాయి. ఆ తరువాత వచ్చిన కొండపాలెం సినిమా కూడా డిజార్డర్ కావడంతో రకుల్ కు మరో షాక్ తగిలిందనే చెప్ప వచ్చు.
చెప్పాలంటే కొత్త హీరోయిన్లు రావటం వల్ల కూడా రకుల్ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. ఇక మళ్లీ తెలుగులో తనకి పూర్వవైభవం సొంతం కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా సినిమా కథలు ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు