సల్మాన్ ఖాన్ ఐశ్వర్యరాయ్ మధ్య ఎఫైర్ ఉందా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఐదు పదల వయసు వచ్చినప్పటికీ కూడా ఇంకా వివాహం చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా తన కెరీర్ ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక అప్పట్లో ప్రపంచ సుందరిగా పేరు పొందిన ఐశ్వర్యరాయ్ తో ప్రేమాయణం కొనసాగించారని వార్తలు వినిపించాయి. అయితే వీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ చివరిలో వీరికి పెళ్లికి బ్రేక్ పడిందని వార్తలు వినిపించాయి.

Breakup story: Salman Khan and Aishwarya Rai

ఒకవైపు ఐశ్వర్యరాయ్ తో ప్రేమాయణం కొనసాగుతూనే మరొకవైపు ప్రీతి జింతాతో సల్మాన్ ఖాన్ ప్రేమాయణం నడుపుతూ ఉండేవారట. ఈ విషయం తెలిసి ఆఖరీలో ఐశ్వర్యరాయ్ వివాహానికి నిరాకరించిందని సమాచారం. పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన ఐశ్వర్యరాయ్ ,సల్మాన్ ఖాన్.. ఆరోజుల్లో కలిసి తిరిగే వారట. ఇక వీరిద్దరి గురించి అప్పట్లో బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు కూడా వినిపించాయి. ముఖ్యంగా వీరి ఫోన్ కాల్స్ సంభాషణ అప్పట్లో సెన్సేషనల్ హార్ట్ టాపిక్ గా మారిపోయింది. దీంతో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ మరియు ఐశ్వర్యారాయ్ అసలు మాట్లాడుకోలేదట.ఇక ఆ తర్వాత ఐశ్వర్యారాయ్ ,అభిషేక్ బచ్చన్ ప్రేమించి వివాహం చేసుకుంది. సల్మాన్ ఖాన్ మరో ప్రేయసి ప్రీతిజింతా 2016 ఫిబ్రవరి 29న ఆమె కూడా వేరే వివాహం చేసుకుంది. ఇక వీరిద్దరితో ప్రేమాయణం నడిపిన తర్వాత కత్రినా కైఫ్ తో చాలా కాలం వరకు డేటింగ్ చేశారని వార్తలు వినిపించాయి. ఆ వెంటనే జాక్ విలియంతో కొన్ని రోజులు డేటింగ్ చేశారని సమాచారం.

Share.