సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు ఒక్క సినిమాతోనే ఓ రేంజ్ విజయాలను అందుకుంటారు. ఆ తరువాత చిత్రం తీస్తే అది సక్సెస్ అవుతుందో లేదో చెప్పలేము… కానీ రాజమౌళి తీసిన బాహుబలి బాహుబలి 2 ,RRR సినిమాలో రాజమౌళిని ఓ రేంజ్‌కు తీసుకువెళ్లాయి. గత పది ఏళ్లలో జక్కన్న తెరకెక్కించిన సినిమాలు మూడే అయినా ఆయన బ్రాండ్ మాత్రం ఊహించని రేంజ్ లో పెరిగింది. సినిమాల ఒత్తిడి వల్లే కొంతమంది డైరెక్టర్లు ఒకప్పుడు వరుస విజయాలను సొంతం చేసుకున్న తర్వాత రోజుల్లో ఆ అంచనాలను అందుకునే విషయంలో తడబడుతుంటారు.
కానీ రాజమౌళి తీసిన మూడు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రికార్డులను బద్దలు కొట్టాయి. అయితే ఇప్పుడు మహేష్ బాబుతో జక్కన్న సినిమాకు ఒకింత టెన్షన్ ఉందని తెలుస్తోంది. సినిమా రిజల్ట్ కు సంబంధించి సందేహం లేకపోయినా గత సినిమాల రికార్డును బ్రేక్ చేయడం జక్కన్నను టెన్షన్ పెడుతోందని ఇండస్ట్రీ వర్గాలలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.. తను తీసిన సినిమాలే రాజమౌళికి కొత్త సమస్యలు సృష్టిస్తున్న నేపథ్యంలో జక్కన్న ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకుంటారో చూడాల్సి ఉంది.
ఇక మహేష్ జక్కన్న కాంబోలో మార్చి నెల నుంచి షూటింగ్ జరగబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి హీరోయిన్గా హాలీవుడ్ బ్యూటీని తీసుకురాబోతున్నట్లు సమాచారం. అయితే హాలీవుడ్ యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఉంటాయని సమాచారం. మహేష్ బాబు సినిమాకి రూ.700 కోట్ల రూపాయల బడ్జెట్ లో తెరకెక్కించనున్నారు. ఇక్కడే కాదు ఇతర దేశాల ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని ఆ అంచనాలకు మించి ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.