బాలీవుడ్ నటి ఫ్లోరా సయానీ ప్రతి ఒక్కరికి సుపరిచితమే తెలుగు వారికి కూడా ఈమె ఆశ సైనీ గా మంచి పాపులారిటీ అందుకుంది.. ప్రేమ కోసం, అంతా మనమంచికే ,నవ్వుతూ బతకాలి రా నరసింహనాయుడు నువ్వు నాకు నచ్చావ్ వంటి తదితర చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. అయితే మీటు ఉద్యమం పీక్స్ లో ఉన్న సమయంలో ఒక ప్రముఖ నిర్మాత ఈమె పైన తీవ్రమైన లైంగిక దాడి చేశారని ఈమె తెలియజేసిన సంగతి తెలిసిందే. 14 నెలల పాటు నరకం అనుభవించారని తెలియజేసింది.
దీన్ని గుర్తుచేసుకుంటు తాజాగా తన ఇంస్టాగ్రాఫ్లో ఒక వీడియోను పోస్ట్ చేయడం జరిగింది. ఇందులో తనకు జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకుంటూ నేను ప్రముఖ నిర్మాతను ప్రేమించాను కానీ నా పరిస్థితి అంతలోనే పూర్తిగా మారిపోయింది. అతను నన్ను ప్రతిసారి దుర్భాషలాడే వాడు తన ముఖం , ప్రైవేటు పార్ట్ ల పైన చాలా విచక్షరహితంగా ప్రవర్తించేవారు.అతను నా ఫోన్ లాక్కొని బలవంతం చేసేవారు. నటన మానేయాలని 14 నెలలు చిత్రహింసలు పెట్టారని తెలియజేసింది ఆశ సైనీ. చివరికి అతడి నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చానని తెలిపింది.
ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నారని ఆ నరకం నుండి కోలుకోవడానికి కొన్ని సంఘాల సమయం పట్టిందని..నన్ను ఇష్టపడే వారి వద్దకు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ఒక వీడియో ద్వారా ఈమె తెలియజేసింది. అయితే ఆ నిర్మాత ఎవరనే విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు. 2016 నుండి ఈమె మేడ్ ఇన్ ఇండియా , సిటీ ఆఫ్ డ్రీమ్ ,ఆర్య వంటి వెబ్ సిరీస్లలో నటించింది.
View this post on Instagram