టాలీవుడ్ లో అక్కినేని కొడుకులతో తక్కువ గ్యాప్ లో నటించిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ ఈమెకు నాగచైతన్యతో మరియు అఖిల్ తో తీసిన రెండు సినిమాలు ఈమెకి నిరాశనే మిగిలించాయి. ఇక నిధి అగర్వాల్ యొక్క క్రేజ్ ను పెంచడంలో ఈ రెండు సినిమాలు విఫలమయ్యాయని చెప్పాలి. అయితే ఈ సినిమాల్లో నటించిన అనుభవంతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరో రామ్ సర్సన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ అమ్మడు
ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నిధి అగర్వాల్ క్రేజీను సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ సినిమాతో మొదటి సక్సెస్ను తన సొంతం చేసుకుందనే చెప్పాలి. ఆ ఒక్క సినిమా సక్సెస్ కావడంతో ఈ అమ్మడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారటం ఖాయమని అంతా భావించారు. కానీ అమ్మడి లక్ సరిగ్గా లేకపోవడంతో ఆ సమయంలోనే కరోనా తో మొత్తం ఇండస్ట్రీ అంతా అతలాకుతలమయ్యింది. అప్పుడు ఈ అమ్మడి ఆఫర్లన్నీ ఎగిరిపోయాయి. అయితే ఈమధ్య పవన్ కళ్యాణ్ సినిమా హర హర వీరమల్లు సినిమాలో నటించబోతోంది. ఈ సినిమాపై మాత్రమే ఈ అమ్మడి యొక్క ఆశలు ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పెద్దపెద్ద ఆఫర్లను సొంతం చేసుకోలేకపోయింది. అయితే ఈమెకు లక్ కలిసి రాకపోవటంతో పవన్ సినిమా హర హర వీరమల్లు షూటింగ్ వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికి కూడా ఆ మూవీ సగం కూడా అయిపోలేదు. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో హరహర వీరమలలో సినిమాలు విడుదల చేస్తాం అంటున్నారు చిత్ర బృందం. ఒకవేళ ఇయర్లో రిలీజ్ అయితే నిధి అగర్వాల్ కలిసి వచ్చిందననే అనుకోవాలి. ఇక హర హర వీరమల్లు సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో వెయిట్ చేయాల్సిందే.