ఏ సినీ ఇండస్ట్రీలో నైనా సరే ఒకప్పుడు స్టార్ స్టేటస్ ని అనుభవించి ప్రస్తుతం ఇల్లు లేక పలు రకాలుగా ఇబ్బంది పడుతున్న స్టార్స్ చాలామంది ఉన్నారు. వరుస సినిమాలతో ఖాళీగా లేకుండా గడిపిన సినీ నటులు ఇప్పుడు చేసేందుకు అవకాశాలు లేక కొంతమంది పరిస్థితి చాలా దారుణంగా పడిపోయిందని చెప్పవచ్చు అలా ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతున్న వారిలో పాకీజా కూడా ఒకరు. ఒకప్పుడు ఈమె బిజీ ఆర్టిస్ట్ ఈమె డేట్స్ కోసం చాలామంది దర్శక నిర్మాతలు ఎదురు చూసేవారట. అంత బిజీగా గడిపిన పాకీజా ఇప్పుడు సినిమాలలో అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
పాకీజా అసలు పేరు వాసుకి.. ఈమె కామెడీ పాత్రలు ఎక్కువగా చేస్తూ ఉండేది. ఇప్పుడు ఈమె ఒక హాస్టల్లో ఉంటూ కాలాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె దీన పరిస్థితి గురించి తెలియజేసింది. పాకీజా పరిస్థితి తెలుసుకున్న మెగా బ్రదర్ నాగబాబు ఆమెకు ఆర్థికంగా సహాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకీజా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇలా కష్టాలలో ఉండడం చూసి తనకు చాలా బాధ వేసింది. బుల్లితెర గాని సినిమాలలో కానీ చిన్నదో పెద్దదో పాత్ర ఆవిడకు ఇచ్చి మల్లి తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు పరిశ్రమ వారు సహాయపడాలని తెలియజేశారు.
తన వంతు సహాయంగా తాను ప్రయత్నం చేస్తానని అలాగే ఆమెకు ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించానని తెలిపారు నాగబాబు. ఈ సహాయాన్ని తెలుసుకున్న పాకీజా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది ఆయన ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతా అని కూడా తెలియజేసింది. తమిళ్లో తనని పట్టించుకోలేదు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇప్పుడు నేను అన్నం తినాలి అంటే అది తెలుగు వాళ్లే అంటూ ఎమోషనల్ అయింది పాకీజా.