హీరోయిన్ ఇలియానా అంటే తెలియనివారంటు ఎవరు ఉండరు.ఈ మధ్యకాలంలో ఈమె పేరు పెద్దగా వినిపించకపోయిన ఒకప్పుడు మాత్రం టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోయిన్ గా పేరు పొందింది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ మొదట దేవదాసు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి అగ్ర హీరోయిన్గా పేరు సంపాదించింది. అయితే ఆ తర్వాత ఇండస్ట్రీకి ఒక్కసారిగా దూరమైంది ఇలియానా.
ప్రస్తుతం ఈమె చేతిలో ఎలాంటి సినిమాలు లేవు అడపా దడపా సినిమాలలో నటిస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలతో గ్లామర్ తో కుర్రకారులను ఇప్పటికి ఆకట్టుకుంటూ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఇలియానా ఇంస్టాగ్రామ్ లో తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు కాస్త షాక్ కి గురయ్యారు. చేతికి సెలైన్‌తో ఆసుపత్రి బెడ్ పై పడుకున్న ఇలియానా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలతో పాటు తాను ఆహారం తీసుకోలేని స్థితిలో ఉండగా వైద్యులు తనకి సెలైన్ ఎక్కించినట్లుగా కూడా తెలియజేస్తోంది. ఇక మరో ఫోటోతో పాటు ఒక్కరోజులో ఇంత మార్పు అంటే చేతికి సెలైన్ ఎక్కించుకున్న ఫోటోని అభిమానులతో పంచుకోవడం జరిగింది ఇలియానా. ఇలియానాకు 12 ఏళ్ల నుంచి బాడీ డిస్మార్పిక్ అనే డిజాస్టర్ తో బాధపడుతున్నట్లు తెలిపింది.
దీంతో అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. అయితే ఆ తర్వాత తన ఆరోగ్యం పై.. ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆందోళన చెందుతున్న వారిని ఉద్దేశిస్తూ మరొక పోస్టు షేర్ చేసింది.. డాక్టర్లు బాగా చికిత్స అందిస్తున్నారని అందరూ కూడా తన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.. తన పైన ఇంతటి ప్రేమను ఆప్యాయతను చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞురాలిని అంటూ తెలియజేస్తోంది ఇలియానా.