టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్నతనం నుంచే మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్న హీరో మహేష్ బాబు ఈ మధ్యనే తన తండ్రి కృష్ణగారు మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. తండ్రి మరణించిన తర్వాత కొద్ది గ్యాప్ తీసుకొని త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడు.ఈమధ్య టాలీవుడ్ సినిమాలు కూడ పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తున్నాయి..అందుకే బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్లు ఒక సినిమానీ రూపొందిస్తున్నారు.
ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ తన ప్రతి సినిమాలో కూడా ఒక సీనియర్ హీరోయిన్ ను ప్రవేశపెడతాడు.ఇక ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఒక సీనియర్ హీరోయిన్ ని పెట్టాలని త్రివిక్రమ్ ఎంతగానో ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు సినిమాలో కీలక పాత్రకు ఐశ్వరరాయ్ ని సంప్రదించే ప్రయత్నాలు జరుగుతున్నాయట ఒకవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అవ్వటం వల్ల ఐశ్వర్యరాయ్ నటించేందుకు ఒప్పుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక నిజంగానే మహేష్ ,ఐశ్వర్యరాయ్ కలిసి సినిమాలో కనిపిస్తే కచ్చితంగా ఇదొక అద్భుతమైన సినిమా అవుతుంది. ఇక వీరిద్దరి కాంబో గురించి సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇలా అనుకున్నట్టు జరగకపోయినా త్రివిక్రమ్ గట్టిగా తలుచుకుంటే అవుతుంది. అని చాలామంది అనుకుంటున్నారు. మహేష్ తో ఐశ్వర్యరాయ్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతోందనే ప్రచారం కూడా జరిగింది. మహేష్ , ఐశ్వర్యారాయ్ సినిమాలో నటించబోతున్నారా లేకపోతే ఇవన్నీ గాసిప్స్ అనే విషయం తెలియాలి అంటే చిత్ర బృందం స్పందించాల్సి ఉంటుంది.