తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా పాపులర్ పొందిన వారిలో సాయి పల్లవి కూడా ఒకరు. మొదట ఫిదా సినిమాతో తెలుగు కుర్రకారులను సైతం ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. నాచురల్ బ్యూటీగా కూడా పేరు పొందింది ఈ ముద్దుగుమ్మ. అందంతో నటనతో డాన్స్ తో కుర్రకారులను సైతం మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో సాయి పల్లవి నుంచి ఎలాంటి సినిమా అప్డేట్ లేకపోవడంతో అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు. తమిళంలో మాత్రం ఒక సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
సాయి పల్లవి తెలుగులో మాత్రం ఇప్పటివరకు తన తదుపరి చిత్రాన్ని మాత్రం ప్రకటించలేదు. అయితే ఈమె ఇలా ఓకే చెప్పకపోవడానికి పలు కారణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఫైనల్ గా మారుతున్నాయి. సాయి పల్లవి అభిమానులకు షాక్ అయ్యేవిధంగా ఒక విషయం వైరల్ గా మారుతోంది .సాయి పల్లవి ప్రేమ వ్యవహారం కారణాలవల్లే సినిమాలు ఎక్కువగా చేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. సాయి పల్లవి ప్రేమించే వ్యక్తి ఆమెను సినిమాలలో ఎక్కువగా నటింప చేసేందుకు ఆసక్తి చూపడం లేదని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈమె త్వరలోనే వివాహం చేసుకోబోతోందని పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్గా స్టార్ డం ఉన్న సాయి పల్లవి ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.2 కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇలాంటి సమయంలో ప్రేమ పేర్లతో సినిమా కెరియర్ ని నాశనం చేసుకోవద్దు అంటూ అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఇందులో ఏ మేరకు నిజముందో తెలియాల్సి ఉంది.