తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు నరేష్ నాలుగో వివాహం చేసుకోబోతున్నారని అధికారికంగా ప్రకటించడం జరిగింది నటి పవిత్రా తో గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారని వార్తలు వైరల్ గా మారాయి. అంతేకాకుండా నరేష్ తో ఇమే వివాహం ఈ ఏడాది జరగబోతోందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఇంతలో ఏమయిందో ఏమో కానీ నరేష్ మరియు పవిత్ర లోకేష్ దూరమయ్యారు అనే వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. నరేష్ ఇప్పటివరకు తన మూడవ భార్య రమ్య రఘుపతి నుండి విడాకులు పొందలేకపోయారని రమ్య యొక్క కుమారుడు తల్లిదండ్రులు కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
దీంతో కోర్టు ఇద్దరికీ విడాకులు ఇచ్చే వ్యవహారంపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విడాకులు మంజూరు కావాల్సి ఉండగా రమ్య రఘుపతి తన కొడుకు యొక్క బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని కోర్టులో ఆందోళన వ్యక్తం చేసిందట.అందుకే విడాకులు కాస్త ఆలస్యం అవుతున్నాయని సమాచారం. అయితే ఇంతకు విడాకులు వస్తాయో లేదో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయని పలు మీడియా వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. నరేష్ మరొకవైపు తనకు ప్రాణ హాని ఉందని ఇటీవలే రమ్య రఘుపతి ఒక ముఠాకి కూడా సుఫారీ ఇచ్చినట్లుగా తెలియజేశారు.
ఈ విషయాన్ని కోర్టు ముందు కూడా తెలియజేశారు కర్ణాటక చెందిన ప్రముఖ రౌడీషీటర్ తో తన హత్యకి ప్లాన్ చేసినట్లు ఆరోపించడం జరిగింది. ఈ ఆరోపణల పై ఇప్పటివరకు రమ్య రఘుపతి స్పందించలేదు.. మరొకవైపు విడాకులు రాకపోవడంతో నరేష్ పై హత్యకుట్ర జరుగుతోందని తెలిసిన పవిత్రలోకేష్ తిరిగి బెంగళూరుకు వెళ్లిపోయిందని దీంతో నరేష్ కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నరేష్ మాత్రం పవిత్రని తాను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. మరి అసలు విషయం తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.