ప్రభాస్ మహేష్ ఫ్యాన్స్ మధ్య గొడవ.. కానీ హీరోలు మాత్రం..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ప్రభాస్,మహేష్ బాబు ఒకరిని చెప్పవచ్చు. ఇక వీరిద్దరూ కూడా సన్నిహితంగానే ఉంటారని తెలిసిందే .అయితే హీరోల అభిమానులు మాత్రం తాజాగా గొడవ పడడం ద్వారా ఈ విషయం మరొకసారి వైరల్ గా మారుతోంది. ట్విట్టర్లో మహేష్, ప్రభాస్ అభిమానులు చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.. అటు బెంగళూరులో ఇటు హైదరాబాదులో లొకేషన్స్ షేర్ చేసుకుని మరి ఫ్యాన్స్ గొడవ పడుతూ ఉన్నట్లు తెలుస్తోంది. తాము చెప్పిన మాస్ థియేటర్ వద్దకు రావాలని అభిమానులు ఒకరినొకరు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Mahesh follows the route of Prabhas?

అయితే గొడవ మాత్రం జరగలేదు.. కానీ వచ్చి ఉంటే పెద్ద గొడవ జరిగేదని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్లో ఫ్యాన్స్ గొడవ పడుతూ ఉండడంతో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారుతోంది .సోషల్ మీడియాలో అభిమానులు ఈ విధంగా గొడవ పడడం ఇదే మొదటిసారి కాదు గతంలో ఎంతో మంది హీరోల మధ్య ఫ్యాన్స్ గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన చేతిలో ఏకంగా ఐదు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.

Mahesh Babu, Prabhas go under self-isolation

ఇక ప్రభాస్ ఎప్పుడు కూడా ఏ సినిమాను రిలీజ్ చేస్తారో క్లారిటీ లేదు.బాలీవుడ్ డైరెక్టర్లు సైతం ప్రభాస్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మహేష్ విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్, రాజమౌళి దర్శకత్వంలో సినిమాలలో బిజీగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మహేష్, ప్రభాష్ కలిసి నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఫ్యాన్స్ సైతం గొడవ పడడం కరెక్ట్ కాదని పలువురు నెటిజన్లు సైతం తెలియజేస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం ఎందుకు గొడవ పడుతున్నారో విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Share.