ఎన్టీఆర్ , నాగేశ్వరరావ్ తరం తర్వాత వచ్చిన వాళ్లలో చిరంజీవి కూడా ఒకరిని చెప్పవచ్చు. తన నటనతో డాన్స్ తో ఫైట్లతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించారు. అప్పటివరకు ఉన్న మాస్ స్టోరీలను సైతం ఫైట్లను డాన్సులను పక్కనపెట్టి తన బ్రేక్ డాన్స్ తోనే ఆడియన్స్ ని తన వైపు తిప్పుకునేలా చేశారు చిరంజీవి. ఇక చిరంజీవి సమకాలిక నటులలో నాగార్జున, వెంకటేష్, బాలయ్య, మోహన్ బాబు తదితరులు ఉన్నప్పటికీ వీరందరిని చిరంజీవి దాటేసి మెగాస్టార్ గా ఎదిగారు.
కానీ చిరంజీవి టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు చిరంజీవికి తన సినిమాలతో గట్టి పోటీ ఇచ్చేవారని వార్తలు అప్పట్లో వినిపిస్తూ ఉండేవి. కానీ ఒక అమ్మాయి కేసులో సుమన్ ని పోలీసులు అరెస్టు చేయడంతో సుమన్ గురించి ప్రజలలో నెగటివ్ ఫీలింగ్ వచ్చే విధంగా వార్తలు వినిపించాయి. దీంతో నటుడు సుమన్ ఇలాంటి పనులు చేస్తున్నాడు అనే విషయంపై అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో కొద్దిరోజుల సుమన్ కేసు విషయంలో జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి కొన్ని సినిమాలకు హీరోగా చేసిన పెద్దగా సక్సెస్ కాలేదు దీంతో సుమన్ కెరియర్ హీరోగా ముగిసిపోయింది.
అయితే చాలామంది ఎక్కువగా చిరంజీవికి సుమన్ పోటీ ఇస్తున్నాడని ఒకే ఉద్దేశంతో చిరంజీవే సుమనీ అలా కేసులో ఇరికించారని ప్రచారం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కానీ చిరంజీవికి ఈ కేసుకి సంబంధం లేదని ఆయన నేను మంచి ఫ్రెండ్స్ అని ఎన్నోసార్లు చిరంజీవి, సుమన్ స్పందించారు. తాజాగా కూడా చిరంజీవిని ఈ విషయం అడిగితే మళ్లీ కూడా చాలా ఓపెన్ గా వివరించారు.. ఇప్పటికీ నేను సుమన్ చాలా క్లోజ్ గానే ఉంటున్న ఆయన నాకు మంచి మిత్రుడు నేను ఎందుకు ఆ విషయంలో అలా ప్రవర్తిస్తానని తెలియజేశారు.