వారికి గట్టి వార్నింగ్ ఇస్తున్న రామ్ చరణ్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు అలాగే అభిమానం సంపాదించుకున్న వారిలో ముందంజలో ఉంటాడు చిరంజీవి రీ ఎంట్రీ తరువాత వరుసగా రెండుసార్లు రూ .100 కోట్ల రూపాయల షేర్ వచ్చే సినిమాలను చేసి నేటి తరం స్టార్ హీరోలకు ఊపిరి ఆడనివ్వకుండా పోటీ ఇస్తున్నారు. ఇక ఆచార్య గాడ్ ఫాదర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా మిగిలాయి. అందుకని అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇక సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేర్ వీరయ్య అభిమానుల ఆకలిని తీర్చింది.

ఈ సినిమా దాదాపు 130 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాకు సంబంధించి విజయోత్సవ వేడుకని ఓరుగల్లులో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ అప్పుడు నేను ఇక్కడ లేను విదేశాల్లో ఉన్నాను.ఈ చిత్రానికి వచ్చిన టాక్ ని చూసి ఎప్పుడెప్పుడు ఇండియాకి వద్దామా… వచ్చి సినిమా చూద్దామా అని అనుకున్నాను. ఈ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ బాబి గురించి ఒకటి చెప్పాలి.

ఆయన ప్రతి ప్రేమ్ అందంగా చెక్కినట్టుగా కనిపించింది.. సినిమా చూసినంత సేపు మా నాన్నని చూసినట్టు అనిపించలేదు. నా బ్రదర్ ని చూసినట్టు అనిపించింది. ఇక రవితేజ గారి గురించి చెప్పాల్సివస్తే మొట్టమొదటిసారి ఆయన చేత సీరియస్ రోల్ వేయించాడు బాబి… ఆయన పాత్ర అయిపోగానే వెంటనే నెట్ ఫిక్స్ ఓపెన్ చేసి ధమాకా సినిమా చూశాను. అందరూ అంటూ ఉంటారు చిరంజీవి గారు సౌమ్యులు అని ఆయన సౌమ్యంగా ఉంటేనే ఇంతమంది వచ్చారు. ఒక్కసారి ఆయన కన్నెర్ర చేస్తే ఆయన మీద కామెంట్స్ చేసే వాళ్ళు ఎవ్వరూ మిగలరు.. అంటూ తన తండ్రి గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share.