ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ కే పాపులర్ హీరోయిన్ గా పేరు సంపాదించింది హీరోయిన్ కృతి శెట్టి. తన మొదటి సినిమాతోనే హిట్టు పడేసరికి వరుస ఆఫర్లు వెలుపడ్డాయి. ఆ సమయంలో కథ గురించి పెద్దగా ఆలోచించకుండా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. ఆ వెంటనే శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమా అంత మంచి హిట్లర్ పడ్డాయి. ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్స్ తో మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వరుసగా దివారియర్, అమ్మాయి గురించి మీకు చెప్పాలి మాచర్ల నియోజకవర్గం ఇలా వరుస ప్లాపులతో పెద్ద షాక్ పడింది.
అయితే ఇకమీదట కథలు విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలనుకుంటోందట క్రతి శెట్టి. అంతేకాకుండా స్టార్ డైరెక్టర్ ,స్టార్ హీరో క్యాలిక్యులేషన్ కూడా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మాక్సిమం లవ్ స్టోరీలకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. కమర్షియల్ సినిమాలలో కూడా తన పాత్రకు వెయిట్ ఉంటేనే సినిమాకు ఓకే చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కృతి శెట్టి ఈ నిర్ణయం తీసుకున్న వెనుక తన ఫ్లాపులే కాకుండా కెరియర్ రిస్క్ లో పడితే అవకాశాలు వస్తాయి రావు అన్న ఆలోచనతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
వరుస విజయాలు అందుకున్నప్పుడు కంటే ఫ్లాపులు పడినప్పుడే కెరియర్ మీద ఎక్కువ భయం ఏర్పడింది. ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి కస్టడీ అనే చిత్రంలో నటిస్తున్నది. ఇక మరే తెలుగు సినిమాలో కూడా నటించలేదు అయితే ఈ మధ్యలోనే మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కృతి శెట్టి కథల ఎంపికలు జాగ్రత్త తీసుకొని సరైన సినిమా కథల కోసం వెయిట్ చేయడం మంచిదే కానీ మరింత గ్యాప్ ఎక్కువ అయితే ఆడియన్స్ కూడా మర్చిపోయే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.