మహేష్ బాబు పోకిరి సినిమాతో ఇండస్ట్రీలో మొదలైన రీ రిలీజ్ సినిమాల హవా.. ఇప్పుడు కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినీ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచిన చిత్రాలను వారి పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో మళ్లీ రీ రిలీజ్ చేసి భారీ కలెక్షన్స్ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రామ్ చరణ్ సినిమాని కూడా రీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నహాలు సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ కలిసి నటించిన చిత్రం మగధీర. ఈ సినిమా రామ్ చరణ్ కు రెండవ చిత్రం అయినప్పటికీ ఓవర్ నైట్ లోనే రామ్ చరణ్ స్టార్ హీరో ను చేసింది.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను.. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్లలో రీ రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మార్చి 27వ తేదీన రామ్ చరణ్ బర్తడే కాబట్టి ఆ రోజు నిర్మాత అల్లు అరవింద్ మగధీర సినిమాను రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే దీని గురించి గీత ఆర్ట్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఇకపోతే ఈ సినిమా రామ్ చరణ్ సినీ కెరియర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. ఇక్కడ నుంచే రాజమౌళి సినీ గ్రాఫ్ మొత్తం మారిపోయింది.
2009లోనే అల్లు అరవింద్ ఈ సినిమా కోసం దాదాపు రూ.45 కోట్లు ఖర్చు చేశాడు. ఆ సమయంలో ఒక సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టాలి అంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ అల్లు అరవింద్ సాహసం చేసి సినిమాను తెరకెక్కించగా.. ప్రతిఫలంగా మూడు రెట్లు అధికంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించింది ఈ సినిమా. ఫాంటసీ యాక్షన్ ఫిలిం గా వచ్చిన ఈ సినిమాలో చరణ్ వారియర్ పాత్రలో కనిపించాడు. కాజల్ అగర్వాల్ ని చూసిన ప్రేక్షకులు యువరాణి అంటే ఇలానే ఉంటుంది అనే ముద్ర వేసింది.. ఇందులో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.