రవితేజ గురించి తెలియని విషయాలు చెప్పిన నటుడు కమల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో రవితేజ కూడా ఒకరు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే ఆ తర్వాత పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో నటించి హీరోగా మారి మంచి విజయాలను అందుకున్నారు. ఇక క్రాక్ సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు రవితేజ. ఆ వెంటనే వరుసగా డిజాస్టర్లు చవిచూడడంతో మళ్లీ ధమాకా చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమాతో రూ .100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు.

ఈ సినిమా సక్సెస్ తో రవితేజ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారని చెప్పవచ్చు.చిరంజీవితో కలిసి చేసిన వాల్తేర్ వీరయ్య సినిమాని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహించారు ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుదలే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో రవితేజ అతిథి పాత్రలో నటించి ఈ సినిమా విజయ దిశగా తీసుకువెళ్లారు. ఇక కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ రావణాసుర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నది. సుశాంత్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.

Actor Kamal Tumu Reveals Hero Ravi Teja Struggles In Industry - Sakshi

ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. రవితేజ ఇంటికి సంబంధించి కమల్ అనే నటుడు చెప్పడంతో ఒక విషయం వైరల్ గా మారుతోంది.. సీతారామయ్యగారి మనవరాలు మూవీతో నేను హీరోగా పరిచయమయ్యాను.. ఆప్పటికీ రవితేజ ఇంకా హీరోగా కాలేదు.. ఇప్పుడు ఎంతో ఎనర్జిటిక్ కనిపిస్తున్నాడో అప్పుడు కూడా అంతే ఎనర్జిటిక్తో ఉండేవారు కాకపోతే కాస్త లావుగా కనిపిస్తున్నారు రవితేజ కెరియర్ లో ఎంతో కష్టపడి తనని తాను మార్చుకొని యంగ్ హీరోలకు టాప్ కాంపిటీషన్ ఇస్తున్నారు. ఇప్పటికి రవితేజ ప్రతిరోజు ఎక్సర్సైజులు చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఈ మధ్యనే రవితేజ అని కలిశాను కెరియర్ ప్రారంభంలో హైదరాబాదులో ఒక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఉంటే చాలని వచ్చాను.. ఆ తర్వాత వచ్చినదంతా బోనసే అని నాతో అన్నాడు.. అలాంటి రవితేజ ఇప్పుడు రూ .12 కోట్ల విలువ చేసి ఇంట్లో ఉంటున్నాడు అంటూ తెలియజేశారు. దీంతో నటుడు కమల్ రవితేజ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.

Share.