ఆమె వల్లే అలాంటి బాధ నుంచి బయటపడ్డాను అంటున్న రజినీకాంత్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తన స్టైల్ తో ఒక ట్రెండ్ సెట్ చేసిన హీరోలలో రజనీకాంత్ కూడా ఒకరు. రజనీకాంత్ మొదట బస్సు డ్రైవర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. కోలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తు ప్రేక్షకులను అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నారు. నటనలోనే కాకుండా వ్యక్తిత్వం లోను కూడా ఆయనను చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందుతూ ఉంటారు.

Rajinikanth expresses gratitude to his wife for changing his life for the betterరజనీకాంత్ మాత్రం తన భార్య తనను ఎంతో మార్చిందని ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సందర్భాలలో తన భార్య లత గురించి ఎన్నో వేదికల పైన తెలియజేశారు రజినీకాంత్. తాజాగా మరొకసారి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే తమిళనాడులో జరిగిన ఒక కార్యక్రమంలో అతిదిగా పాల్గొన్న రజనీకాంత్ తన భార్య వల్లే క్రమశిక్షణ నేర్చుకున్నానని తెలిపారు. తన భార్య లత నాకు పరిచయం చేసిన మహేంద్రనుకు నేను రుణపడి ఉంటాను..

Rajinikanth had many bad habits - smoking, drinking and eating…, she changed his life

బస్సు కండక్టర్గా చేస్తున్నప్పుడు రోజు మద్యం తాగేవాడిని రోజుకు ఎన్ని సిగరెట్లు తాగేవాడినో లెక్క ఉండేది కాదు అలాగే రోజు మాంసాహారాన్ని కూడా తినేవాడిని.. కానీ ఈ మూడు మంచి అలవాట్లు కాదు.. వీటికి బానిసైన వాళ్ళు కొంతకాలం తర్వాత అనారోగ్యకరమైన జీవితాన్ని గడపాల్సిందే అంటూ తన భార్య లత తనతో ప్రేమతో చెప్పేదని తెలిపారు. ఈమె వల్లే ఇప్పుడు నేను ఇలాంటి క్రమశిక్షణ జీవితాన్ని కడుపుతున్నానని తెలియజేశారు రజనీకాంత్. ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం రజనీకాంత్ కి 169వ చిత్రం.

Share.