తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా విష్ణు ప్రియ ఎంతటి పాపులారిటీ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇలాంటి పాపులర్ తోనే ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్న పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో అప్పుడప్పుడు జిమ్ వర్కౌట్ లోకి సంబంధించి వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది విష్ణుప్రియ. తాజాగా విష్ణు ప్రియ ఇంట తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆమె తల్లి కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది విష్ణు ప్రియ.
ఈ సందర్భంగా తన తల్లితో కలిసి ఉన్న ఒక ఫోటోని షేర్ చేస్తూ మై డియర్ అమ్మ ఈరోజు వరకు నాతో తోడున్నందుకు నీకు ధన్యవాదాలు. నేను తుది శ్వాస విడిచే వరకు నీ పేరు నిలబెట్టేందుకు పలు రకాలుగా కృషి చేస్తూ ఉంటానని తెలియజేస్తోంది. నువ్వే నా బలం నువ్వే నా బలహీనత అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది. ఇక విష్ణుప్రియ ఈ వార్త తెలుసుకున్న అభిమానుల సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. విష్ణు ప్రియ కుటుంబం పట్ల సానుభూతిని కూడా వ్యక్తం చేస్తున్నారు.
విష్ణు ప్రియ మొదట యూట్యూబ్ గా తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత పోవే పోరా షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తర్వాత పలు టీవీ షోలలో కూడా యాంకర్ గా నటిగా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇటీవల సుదీర్ తో కలిసి వాంటెడ్ పండుగాడు చిత్రంలో హీరోయిన్గా నటించింది. గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి విష్ణుప్రియ ,జబర్దస్త్ రీతూ చౌదరి పలు వెకేషన్ లకు వెళ్లిన ఫోటోలను షేర్ చేయడం జరిగింది.<
View this post on Instagram
/p>