తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ జమున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో వైవిధ్యమైన చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడు తాజాగా జమున కన్నుమూసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయిm హైదరాబాదులోని స్వగృహంలో తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. తెలుగువారి సత్యభామగా మనల్ని మెప్పించిన తొలి తరం నటి జమున ఇకలేరని విషయం తెలిసిన అభిమానుల సైతం చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అయితే ఈమె వయసు పెరగడంతో పలు అనారోగ్య కారణాలతో మరణించినట్లుగా తెలుస్తోంది.
జమున 1937లో కర్ణాటక రాష్ట్రంలో హంపిలో జన్మించింది. ఈమె కుటుంబ సభ్యులు ఆంధ్రకు వెళ్లడంతో గుంటూరు జిల్లాలో తన బాల్యాన్ని గడిపినట్లుగా తెలుస్తోంది. జమున అసలు పేరు జనాభాయి.. అయితే ఈమె జన్మ నక్షత్రాన్ని బట్టి ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు తెలియజేయడంతో ఈమె పేరుని మార్చినట్లుగా తెలుస్తోంది. ఆమె పేరు జమునగా మారడం జరిగింది. నటుడు జగ్గయ్యది కూడా ఇదే గ్రామం కావడంతో జమున కుటుంబానికి మంచి పరిచయం ఉంది.
జమున చదువుకునే రోజుల్లోనే నాటకాలవైపు ఇంట్రెస్ట్ ఉండడంతో ఆమె నాటకాలలో ఎక్కువగా పాల్గొనేదట అప్పుడు తెనాలి సమీపంలోని ముందూరు గ్రామంలో ఒక నాటకాన్ని వేస్తున్న జగ్గయ్య ప్రత్యక్షంగా జమునాను ఎంపిక చేయడం జరిగిందట.ఆనాటకంలో మరో ప్రముఖ నటుడు గుమ్మడి కూడా నటించారు. ఈ నాటకం కారణంగానే ఈమె ఇతర నాటకాలలో నటించింది అలా మొదటిసారిగా ఆమె పుట్టినిల్లు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆ తర్వాత అక్కినేని ఎన్టీఆర్ తదితరునటులతో హీరోయిన్గా నటించింది. ఈమె కెరియర్లు సత్యభామ పాత్ర పోషించడం మంచి పాపులారిటీ సంపాదించింది.