తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో చిరంజీవి బాలయ్య కూడా ఒకరు. వీరిద్దరూ బడాస్టార్ హీరోలని చెప్పవచ్చు. అయితే వీరు అలా ఎదగడానికి ముఖ్య కారణం వారి కుటుంబ సభ్యులు అని చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. వీరు హీరోలుగా ఎప్పుడు బయట ఉంటే కుటుంబాన్ని పట్టించుకోని..పిల్లలని పెద్ద చేసి బాధ్యత వారి భార్యలపై ఉంటుందని చెప్పవచ్చు. ఇక చిరంజీవి, బాలకృష్ణ ఈ విషయంలో లక్కీ హీరోలే అని చెప్పవచ్చు.
చిరంజీవి భార్య సురేఖ..బాలకృష్ణ భార్య వసుంధరలో ఒక కామన్ పాయింట్ ఉంది.అదేమిటంటే చిరంజీవి భార్య సురేఖ ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల ఉమ్మడి కుటుంబానికి పెద్ద కోడలుగా వచ్చింది. ఆమె ఇంట్లో ఉన్న వారందరు, బంధువులు అభిమానులు వచ్చిన వారికి ఎలాంటి మర్యాదలలో లోటు చేయకుండా ఉంటుంది.అందుచేతనే ఈమె ఎప్పుడూ కూడా ఎలాంటి వివాదాలు ఉండదు. అంతేకాకుండా తన ఇంటికి వచ్చిన వారిని అడిగి తెలుసుకుని మరి వారి బాగోగులను తెలుసుకొని ప్రయత్నం చేస్తుందట సురేఖ. అలా వారిని కూడా సొంత మనసులో చూసుకోవడంతో ఇండస్ట్రీలో కొంతమంది చిరంజీవి మరింత క్రేజ్ పెరిగింది.
ఇక చిరంజీవి భార్యకు ఏ మాత్రం తీసిపోదు బాలకృష్ణ భార్య వసుంధర. ఈమె నందమూరి కుటుంబ పరువును నిలబెట్టేలా ప్రతి ఒక్కరికి మర్యాద ఇస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చేవారికి సకల సౌకర్యాలను అందించడంలో ముందువరుసలో ఉంటుందట వసుంధర. బాలయ్య ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన లోటు తెలియకుండా ఇంటిని చాలా చక్కదిద్దడంలో ముందుంటుందని చెప్పవచ్చు. ఇలా బాలయ్య ,చిరంజీవి కూడా వారి భార్యల గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో బాగా చర్య చేస్తూ ఉంటారు. అందుకే ఇద్దరి హీరోలు తమ స్టార్ హీరోలు ఎదగడానికి ముఖ్య పాత్ర భార్యని కారణమని చెప్పవచ్చు.