టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీ ఉన్న హీరో, హీరోయిన్లలో విజయ్ దేవరకొండ ,రష్మిక మందన్నా కు మంచి పాపులారిటీ ఉంది.వీరిద్దరూ మొట్టమొదటగా గీతగోవిందం సినిమాలో నటించారు. ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమాను చేశారు. అలా వీరిద్దరి స్నేహం కొనసాగుతూనే ఉంది. వీరిద్దరూ ఒకరంటే ఒకరు చాలా అభిమానించుకుంటూ ఆరాధించుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ తో సినిమాలు చేయడం రష్మిక చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ఆమె సినిమాల్లో నటించిన సమయంలో విజయ్ దేవరకొండ కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరచడం మనం చూడవచ్చు.
అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో రష్మిక కనిపించిందని చెప్తుంటారట. వీరిద్దరి మధ్య అంత మంచి స్నేహం ఉందని పలు సందర్భాలలో నిరూపితమయ్యింది. ఈ మధ్యనే విదేశీ టూర్ కి వెళ్లారు వీరిద్దరూ రష్మిక ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకుంది. విజయ్ దేవరకొండ నాకు మంచి స్నేహితుడు అతనితో కలిసి టూర్కు వెళితే తప్పేంటి అంటూ మీడియా వారిని ఎదురు ప్రశ్నించింది. ఎంతో ధైర్యంగా టూర్ కి వెళ్ళాం అంటూ చెప్పిన రష్మిక ఎందుకని మేమిద్దరం ప్రేమించుకుంటున్నామనే విషయం చెప్పటం లేదు. అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రేమించుకుంటున్నప్పుడు ఒప్పుకోవటంలో తప్పేముంది ఎందుకు భయపడాలి అని కొందరు ప్రశ్నలు కురిపిస్తున్నారు.
విజయ్ తో ప్రేమలో ఉన్నానని చెబితే ఆమెకు సినిమా అవకాశాలు తగ్గుతాయేమో అని భయపడి చెప్పలేదేమో అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.. ఆ కారణంగానే ఆమె విజయ్ దేవరకొండ తో ఉన్న రిలేషన్ గురించి అధికారికంగా వెల్లడించటం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.రష్మిక మాత్రమే మేమిద్దరం స్నేహితులం అంతకుమించి ఏమీ లేదు అంటూ సోషల్ మీడియా జనాలు మాట్లాడుకోవద్దు అంటూ విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది అప్పుడైనా వాళ్ళ రిలేషన్ గురించి క్లారిటీ ఇవ్వాల్సిందే కదా.