కుట్టి వినీత హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం “ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు”. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా దర్శకనిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, ఏవీఎస్ తదితరులకు మంచి ఇమేజ్ కూడా లభించిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నాగ్ అశ్విన్ కూడా ఈ సినిమా ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు.
ఇకపోతే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన వినీత అందం, అభినయంతో పాటు చక్కటి ముఖ కవళికలు కూడా కలిగి వరుసగా సినిమా అవకాశాలను సొంతం చేసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ అర్ధాంతరంగా ఈమె సినీ జీవితం ముగిసింది అని చెప్పాలి. ఇందుకు కారణం డబ్బు కోసం వ్యభిచార రొంపులోకి దిగి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. అంతేకాదు ఇలా వ్యభిచారం నడుపుతూ పోలీసులకు పట్టబడడంతో కొన్ని రోజులు జైల్లో కూడా జీవితాన్ని గడిపిందని వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి.
తాత్కాలిక సుఖం కోసం డబ్బు సంపాదించడానికి తప్పటడుగులు వేసి తన సినీ జీవితాన్నే కాదు వ్యక్తిగత జీవితాన్ని కూడా నాశనం చేసుకుంది. మరోపక్క వివాహానికి కూడా దూరమైంది వినీత. ఒకరకంగా చెప్పాలి అంటే ఈమె అలా విచార కేసులో ఇరుక్కోవడంతో సినిమాలలో కూడా అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాలలో అవకాశాలు రాకపోయేసరికి చివరికి చెన్నైలో స్థిరపడిపోయింది. గతంలో తాను చేసిన చిన్న తప్పిదం వల్లే అటు వైవాహిక జీవితానికి ఇటు సినీ జీవితానికి కూడా దూరమైంది వినీత.