గత కొద్ది రోజులుగా కీర్తి సురేష్ కి సంబంధించి ప్రేమ, పెళ్లి అంటూ వార్తలు కోలీవుడ్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ చెక్కర్లు కొడుతోంది. తన చిన్ననాటి స్నేహితుడితో కీర్తి గత 13 సంవత్సరాలుగా ప్రేమలో ఉందనే వార్త ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే మహానటి సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని ఈ సినిమాతో తన కెరీర్ ను ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది.
తమిళంలో కూడా వరుస చిత్రాలు చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె గత కొద్ది రోజులుగా ప్రేమ , పెళ్లి అంటూ వార్తల్లో నిలుస్తోంది . ఈ క్రమంలోనే.. తన ప్రేమ కథ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారుతోంది. కెరియర్ మొదట్లో తనలోని ఇన్నోసెంట్ యాంగిల్ ని.. తాను చేసిన మహానటి సినిమాతో తనలోని క్లాసిక్ యాంగిల్ ని.. నిన్నకాక మొన్న చేసిన సర్కారు వారి పాట సినిమాతో తనలోని గ్లామర్ యాంగిల్ ని చూపించిన కీర్తి సురేష్ ఇప్పుడు లవ్ యాంగిల్ తో కూడా అందరిని ఆశ్చర్య పెడుతోంది . త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కపోతోంది అనే వార్తతో ఇప్పుడు టాక్ ఆఫ్ ది సౌత్ ఇండియా గా మారిపోయింది.
అసలు విషయంలోకి వెళితే కేరళ మీడియా రిపోర్టు ప్రకారం హీరోయిన్ కీర్తి సురేష్ చిన్ననాటి స్కూల్ స్నేహితుడితో గత 13 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారట. అతడు ఒక వ్యాపారవేత్త అని.. కేరళలో అతడికి రిసార్ట్స్ ఉన్నాయని సమాచారం. సినిమా షూట్ గ్యాప్ మధ్యలో అతనితో ప్రేమలో విహరిస్తుందట కీర్తి సురేష్. మీడియా ముందుకు రాకుండా జాగ్రత్త పడుతూనే రీసెంట్ గా మీడియాకు దొరికేసారట. ఈ విషయంపై ఫిలిం మీడియా విపరీతంగా ఆరా తీయడంతో కీర్తి సురేష్ నిజంగానే ప్రేమలో ఉందని అతనిని పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. అయితే ఇంకో నాలుగు సంవత్సరాలు టైం పట్టొచ్చు అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.