పాన్ ఇండియా హీరోగా పేరు పొందిన ప్రభాస్ ప్రస్తుతం తన నటించే సినిమాలు అన్నీ కూడా భారీ బడ్జెట్ తో ఉన్నవే. ప్రస్తుతం ప్రభాస్ కేజిఎఫ్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటించింది. ఈ సినిమా విడుదల కోసం ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో ఆదృతగా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా ఈ సినిమా నుంచి లీకైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
ఇప్పుడు కూడా తాజాగా సలార్ సినిమా షూటింగ్ కు సంబంధించి కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సైతం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కావాలనే ఎవరో ఇలాంటి పని చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అయితే లీకైన ఫోటోలలో ప్రభాస్ మాత్రం చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నారు. దీంతో చిత్ర బృందం మరొకసారి అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .ఇప్పటివరకు సలార్ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ చిత్రం షూటింగ్ కూడా ఇప్పటికి 80 శాతం పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఏడాదిలో విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రభాస్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే ప్రాజెక్ట్ -k, ఆది పురుష్, స్పిరిట్ తదితర చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలే కావడం గమనార్హం.