తెలుగు ఇండస్ట్రీలో గమ్యం సినిమాతో హీరోగా పరిచయమయ్యారు శర్వానంద్. అక్కడి నుంచి అంచలంచలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. శర్వానంద్ ఏ సినిమా తీసిన అందులో ఏదో ఒక మంచి మెసేజ్ ఉంటుందనే చెప్ప వచ్చు. శర్వానంద్ తీసిన సినిమాలు తక్కువే కానీ అన్ని మంచి సక్సెస్ ని తెచ్చి పెట్టాయి. ఇతడు నటించిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా దక్కింది. ఇప్పుడు శర్వ గురించి ఒక టాప్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.అదేమిటంటే శర్వానంద్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఇదివరకే శర్వానంద్ పెళ్లి గురించి వార్తలు వచ్చాయి. అప్పుడు అమ్మాయికి సంబంధించిన వివరాలు మాత్రం బయటకి రాలేదు.
ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో శర్వానంద్ ఒకరు ఇప్పుడు ఆ ట్యాగ్ ను తొలగించుకోనున్నారు.. ఎందుకంటే.. త్వరలోనే శర్వా పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమె పేరు రక్షిత రెడ్డి ఆమె అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుంది. ఈ అమ్మాయి తోనే శర్వా త్వరలోనే ఏడడుగులు నడవ బోతున్నాడు ఈనెల 26వ తేదీన కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే వీరి కుటుంబ సభ్యులందరూ కలిసి వీరి పెళ్లి తేదీని వెల్లడించనున్నారు. రక్షిత కు రాజకీయ నేపథ్యం ఉంది ఈమె తండ్రి మధుసూదన్ రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఏపీ మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఈమె మనవరాలు ఈమె మేనమామ గంగిరెడ్డి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డికి అల్లుడు కాగా.. శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో అతిథిగా నటించిన శర్వా రామ్ చరణ్ కి బెస్ట్ ఫ్రెండ్ అనే సంగతి అందరికీ తెలిసిందే..ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అభిమానులను సొంతం చేసుకున్నాడు శర్వానంద్.