రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ఎంత పెద్ద పాపులారిటి అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ వీరిద్దరి కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. ఈ మధ్య నాటు నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆస్కార్ అవార్డునీ RRR సినిమా దక్కించుకుంటుందని ఇండియా మొత్తం అంచనా వేశారు. కానీ ఆ అంచనాలన్నీ తారుమారయ్యాయి. ఉత్తమ నటుడు ఉత్తమ చిత్రం విభాగంలో RRR కు నిరాశ తప్పలేదు. కాగా ఒక ఆస్కార్ అవార్డును ఇండియా చేజేతులారా పోగొట్టుకుందని చర్చ ఇప్పుడు నడుస్తోంది.
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో RRR పోటీపడి ఉంటే దానికి ఇప్పటిదాకా వచ్చిన ఇంటర్నేషనల్ అప్లాజ్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఈ విభాగంలో నామినేషన్ సంపాదించడమే కాక అవార్డును కూడా సొంతం చేసుకునేదన్నది.విశ్లేషకుల మాట ఈ విభాగంలో పోటీ కోసం వివిధ దేశాలు తమ చిత్రాలను నామినేట్ చేశారు.
ఇండియా నుంచి RRR కె అవకాశం దక్కుతుందని అనుకున్నారు. కానీ .. ఫిలిం ఫెడరేషన్ ఆప్ ఇండియా జ్యూరీ సంస్థలు మాత్రం దాన్ని కాదని గుజరాతి చిత్రం చెల్లో షోను ఎంపిక చేశారు.
కనీసం RRR సినిమా నామినేషన్ కూడా సంపాదించలేకపోయింది. ఈ సినిమాకు ఆస్కార్ బెస్ట్ ఫిలిం అవార్డు దక్కే అవకాశం లేవని ముందే విశ్లేషకులు తేల్చేశారు. కానీ ఇండియా నుంచి నామినేట్ వచ్చి ఉంటే కచ్చితంగా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిం పురస్కారానికి గట్టి పోటీ అయ్యేదని… కచ్చితంగా నామినేషన్ సంపాదించేదని విజేతగా నిలిచేది.. కానీ ఆ మూవీని నామినేట్ చెయ్యకపోవటం ద్వారా చేజేతులారా ఇండియాకి వచ్చే ఒక ఆస్కార్ అవార్డుని కోల్పోయిందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. బహుశా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చి ఉంటే ఇండియా మొత్తం గర్వించదగ్గ సినిమా అయ్యుండేది.